ప్రజలకు చంద్రబాబుపై అపనమ్మకం | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు చంద్రబాబుపై అపనమ్మకం

May 31 2026 1:24 AM | Updated on May 31 2026 1:24 AM

రాజంపేట: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై అపనమ్మకం ఏర్పడిన పరిస్ధితులు నేడున్నాయని, గత ఎన్నికల్లో ఓటువేశామని బాధపడుతున్నారని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి విమర్శించారు. శనివారం మేడాభవన్‌లో ఆయన అభిమానులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులతో భేటీ అయ్యారు. ఈసందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ రెండేళ్ల కూటమి పాలనలో ఎన్నికల హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలమయ్యారన్నారు. టీడీపీ రెండేళ్లపాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. రాష్ట్ర ప్రజలు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సారధ్యంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిని గుర్తుచేసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు కూడా చంద్రబాబు పాలనపై అసంతృప్తితో ఉన్నారన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు రెండేళ్ల పాలన మోసపూరితమని, ప్రజలకు వెన్నుపోటు నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు చెప్పారు. మండల, నియోజకవర్గ స్ధాయిలో నిరసనలు జయప్రదం చేయాలన్నారు. వైస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఐక్యంగా ముందుకెళ్లాలని పిలుపు నిచ్చారు. స్ధానికసంస్ధలో వైఎస్సార్‌సీపీ జెండాను ఎగురవేయాలన్నారు. కార్యక్రమంలో నందలూరు మండలాధ్యక్షుడు మేడా విజయభాస్కర్‌రెడ్డి, నందలూరు వైఎస్సార్‌సీపీ కన్వీనరు సిద్ధవరం గోపిరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు కలీం,మోదుగల చంద్రశేఖర్‌, రాజశేఖర్‌రెడ్డి, గంగినాయుడు, మోహన్‌రెడ్డి, నాగసుబ్బయ్య, సోమిశెట్టి ప్రభాకర్‌,ఆల్విన్‌ విజయుడు, మహిళనాయకురాలు పల్లెమాధవి,మైనార్టీ ప్రతినిధులు షాజహాన్‌, జుల్ఫీకర్‌, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.

మేడారఘునాథరెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement