వైద్య విద్యలో విద్యార్థి ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

వైద్య విద్యలో విద్యార్థి ప్రతిభ

May 31 2026 1:24 AM | Updated on May 31 2026 1:24 AM

చేనేతలను ఆదుకోవాలి

కడప సెవెన్‌రోడ్స్‌ : కడపకు చెందిన వసంత్‌ మౌని విహంత్‌రెడ్డి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంపార్టెన్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఎగ్జామ్‌లో ప్రతిభ చాటారు. ఈ పరీక్షలో ఆయన అఖిల భారతస్థాయిలో 26వ ర్యాంకును సాధించారు. న్యూరో సర్జరీ విభాగంలో ఓపెన్‌ కేటగిరి కింద ఎయిమ్స్‌, నిమ్‌హాన్స్‌, జిప్‌మర్‌, పీజీ ఐ చండీఘర్‌లలో 31 సీట్లు మాత్రమే ఉండ గా, అందులో ఒకటి ఆయన కై వసం చేసుకున్నా రు. కడపలోని సింగారెడ్డి ఎన్‌క్లేవ్‌లో నివాసముంటున్న కాంట్రాక్టర్‌ వెంకట సుబ్బారెడ్డి కుమారుడైన విహంత్‌రెడ్డి పూణెలోని ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌డ్‌ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. పీజీలో ఎంఎస్‌ జనరల్‌ సర్జరీని పూణెలోని భారతి విద్యాపీ ఠ్‌ కళాశాలలో పూర్తి చేసి ఇప్పుడు న్యూరో సర్జరీ విభాగంలో సీటు పొందారు.

జమ్మలమడుగు: జమ్మలమడుగు, మోరగుడి, దొమ్మరనంద్యాల, భాగ్యనగర్‌ కాలనీల్లో గురువారం రాత్రి కురిసిన భారీ గాలివానకు చేనేత కార్మికులు సర్వస్వం కోల్పోయి వీధిన పడ్డారని, ప్రభుత్వం వారిని తక్షణమే ఆదుకోవాలని చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శివనారాయణ డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన మోరగుడి తదితర ప్రాంతాల్లో పర్యటించి, నష్టపోయిన కుటుంబాల వివరాలను సేకరించారు. ఉపాధి కోల్పోయిన చేనేత కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే ఆర్థిక సాయం అందించి, ఉచితంగా ముడిసరుకులు పంపిణీ చేయాలని ఆయన కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement