గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో కడప వాసులకు స్థానం | - | Sakshi
Sakshi News home page

గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో కడప వాసులకు స్థానం

May 31 2026 1:24 AM | Updated on May 31 2026 1:24 AM

కడప ఎడ్యుకేషన్‌: కడప నాగారాజుపేటకు చెందిన దివంగత వేపరాల వీర భాస్కర్‌ రావు (రిటైడ్‌ హెడ్‌ మాస్టర్‌ సీఎస్‌ఐ స్కూల్‌) మనవరాలు పెట్లు కావ్య, కుమారుడు వేపరాల గోయల్‌ గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులో స్థానం సాధించారు. విజయవాడకు చెందిన హలెల్‌ మ్యూజిక్‌ స్కూల్‌ వ్యవస్థాపకులు అగస్తిక దండంగి ఆధ్వరంలో 2026 ఫిబ్రవరి 2న పలు దేశాలకు చెందిన 777 మంది ‘ది లార్జెస్ట్‌ ఎలక్ట్రానిక్‌ కీబోర్డ్‌ ఎంసెంబల్‌’ చేశారు. దీంతో 777 మంది గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులో చోటు దక్కించుకొన్నారు. వీరిలో కడప నాగరాజు పేటకు చెందిన పెట్లు కావ్య, వేపరాల గోయల్‌ ఉన్నారు. ఈ నెల 29న హైదరాబాద్‌ గౌచ్చిబౌలి విక్టరీ చర్చిలో జరిగిన కార్యక్రమంలో పాస్టర్‌ అగసిక దండంగి చేతుల మీదుగా ధ్రువపత్రాన్ని అందుకున్నారు.

పాస్టర్‌ ఆగస్తిక దండంగి చేతుల మీదుగా

ధ్రువపత్రాన్ని అందుకుంటున్న కావ్య, గోయల్‌

Advertisement
 
Advertisement
Advertisement