అన్నదాత.. గుండెకోత | - | Sakshi
Sakshi News home page

అన్నదాత.. గుండెకోత

May 30 2026 3:08 AM | Updated on May 30 2026 3:08 AM

అకాలవర్షాలు, ఈదురుగాలులతో దెబ్బతిన్న పంటలు

10 మండలాల్లో అరటి, బొప్పాయి, మునగ పంటలకు నష్టం

రాజుపాలెంలో 88.6 మి.మీ.వర్షం

కడప అగ్రికల్చర్‌: అకాల వర్షాలు, ఈదురు గాలులతో అన్నదాతలకు దెబ్బమీద దెబ్బపడుతూనే ఉంది. తాజాగా శుక్రవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షాలు, ఈదురుగాలులకు జిల్లాలోని 10 మండలాల పరిధిలో ఆరటి, బొప్పాయి, మునగ పంటలు దెబ్బతిన్నాయి. దీంతో 56.99 లక్షల మేర నష్టం జరిగి రైతులకు కొలుకోలేని దెబ్బతగిలింది.

168.85 హెక్టార్లలో పంటలకు నష్టం...

జిల్లావ్యాప్తంగా 10 మండలాల పరిధిలో 201 మంది రైతులకు సంబంధించి 168.55 హెక్టార్లలో పంటలు దెబ్బతిని రూ. 56.99 లక్షల్లో పంట నష్టం జరిగినట్లు ఉద్యానశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనాలను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు నివేదికలు పంపారు. ఇందులో ఒంటిమిట్ట మండలం పరిధిలో ముగ్గురు రైతులకు చెందిన 1.60 హెక్టార్లలో అరటి పంట దెబ్బతిని రూ. 56 వేలు నష్టం జరిగింది. మైదుకూరు మండలంలో 94 మంది రైతులకు సంబంధించి 68 హెక్టార్లలో ఆరటి, 14 హెక్టార్లలో బొప్పాయి పంటలు దెబ్బతిని రూ. 27.30 లక్షలు, మైలవరం మండల పరిధిలో 12 మంది రైతులకు చెందిన మూడు హెక్టార్లలో ఆరటి, 5.85 హెక్టార్లలో బొప్పాయి, 40 సెంట్లలో మునగ పంటల దెబ్బతిని రూ. 2.61 లక్షలు, పొద్దుటూరు మండలం పరిధిలో 12 మంది రైతులకు సంబంధించి 80 సెంట్లలో మునగపంట దెబ్బతిని రూ. 20 వేలు, లింగాల మండల పరిధిలో 5 మంది రైతులకు చెందిన 4 హెక్టార్లలో అరటి దెబ్బతిని రూ. 1.40 లక్షలు, ఎర్రగుంట్ల మండల పరిధిలో 15 మంది రైతులకు సంబంధించి 14 హెక్టార్లలో అరటి దెబ్బతిని రూ. 4.96 లక్షలు, సింహాద్రిపురం మండల పరిధిలో 35 మంది రైతులకు చెందిన 30 హెక్టార్లలో ఆరటి పంట దెబ్బతిని రూ. 10.50 లక్షలు, తొండూరు మండల పరిధిలో నలుగురు రైతులకు సంబంధించి 3 హెక్టార్లో అరటి దె బ్బతిని రూ. 1.05 లక్షలు, కొండాపురం మండల పరిధిలో ఒక రైతుకు సంబంధించి 1.20 హెక్టార్లలో అరటి దెబ్బతిని రూ. 42 వేలు, ముద్దనూరు మండల పరిధిలో 30 మంది రైతులకు సంబంధించి 23 హెక్టార్లలో ఆరటి దెబ్బతిని రూ. 8.05 లక్షల మేర నష్టం జరిగింది.

రాజుపాలెం మండలంలో

అత్యధిక వర్షపాతం నమోదు

జిల్లాలోని రాజుపాలెం మండలంలో అత్యధికంగా 88.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జమ్మలమడుగులో 47.4, మైలవరం మండలంలో 45.6, మైదుకూరు మండలంలో 36.4, పొద్దుటూరు మండలంలో 36, గోపవరం మండలంలో 26.8, ముద్దనూరు మండలంలో 25.2, చాపాడు మండలంలో 19.6, సిద్దవటం, ఎర్రగుంట్ల మండలాల్లో 18.2, కొండాపురం మండలంలో 14.2, బద్వేల్‌ మండలంలో 12.8, కడపలో 8.4, సీకేదిన్నె మండలంలో 5.4 , చెన్నూరు మండలంలో 2.6, ఖాజీపేట మండలంలో 1.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

యుద్ధ ప్రాతిపదికన

విద్యుత్తు పునరుద్ధరణ పనులు

తిరుపతి రూరల్‌: ఏపీఎస్పీడీసీఎల్‌ పరిధిలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో గురువారం రాత్రి బలమైన గాలి, వర్షం కారణంగా పలు గ్రామాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని సీఎండీ శివశంకర్‌ లోతేటి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వైఎస్సార్‌ కడప జిల్లాలోని కొండాపురం, మైదుకూరు, మైలవరం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు గ్రామీణ, దువ్వూరు, రాజుపాలెం, చాపాడు మండలాల్లోని 28 గ్రామాల్లోనూ విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని తెలియజేశారు.ఆయా సర్కిళ్ల సూపరింటెండింగ్‌ ఇంజినీర్ల పర్యవేక్షణలో విద్యుత్‌ శాఖ అధికారులు, సిబ్బంది యుద్ధప్రాతిపదికన విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement