బూత్‌లెవల్‌ ఏజెంట్‌ కీలకంగా వ్యవహరించాలి | - | Sakshi
Sakshi News home page

బూత్‌లెవల్‌ ఏజెంట్‌ కీలకంగా వ్యవహరించాలి

May 30 2026 3:08 AM | Updated on May 30 2026 3:08 AM

రైల్వేకోడూరు అర్బన్‌: నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ చెందిన ప్రతి 252 బూత్‌ లెవల్‌ ఏజంట్‌లు సర్‌ ప్రక్రియలో కీలక భూమిక పోషించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర అదికారప్రతినిధి, మాజీఎమ్మెల్యే, ఇన్‌చార్జి కొరముట్ల శ్రీనివాసులు శక్రవారం తెలిపారు. స్థానిక రాజ్‌కళ్యాణ మండపంలో జరిగిన సర్‌ ప్రక్రియపై అవగాహన కార్యక్రమానికి రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, రాజంపేట, కడప పరిశీలకులు సురేష్‌బాబు, కొండూరుఅజయ్‌రెడ్డి లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్‌ ప్రక్రియలో భాగంగా నియోజవర్గంలో ఓట్ల తొలగింపుపై పార్టీ కార్యకర్తలు, బీఎల్‌ఏ దృష్ఠి పెట్టాలని తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా, నియోజకవర్గ పరిశీలకులు నరసింహారెడ్డి, సహదేవరెడ్డి, పంజంవేణుగోపాల్‌రెడ్డి, సాయికిషోర్‌రెడ్డి, చెవుశ్రీనివాసులురెడ్డి, జెట్పీటీసీరత్నమ్మ, రాయలసీమ బూత్‌కన్వీనర్‌ తల్లెంభరత్‌కుమార్‌రెడ్డి, క్రిష్ణారెడ్డి, , వెంకటరెడ్డి, సీహెచ్‌రమేష్‌, నందాబాల, విజయ్‌కుమార్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, సతీష్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement