● ఓటర్ల జాబితా వైఎస్సార్‌సీపీ
గెలుపునకు తొలిఅడుగు
● వైఎస్ జగన్‌ను సీఎంగా
చేసుకోవాలన్నదే ధ్యేయం
● ఎమ్మెల్సీ టీ. కల్పలతారెడ్డి
రాజంపేట: స్ధానికసంస్థల ఎన్నికల్లో ప్రతి బూల్ లెవెల్ ఏజెంట్(బీఎల్‌ఏ) సైనికుడని, ఓటును కాపాడుకోవాల్సిన బాధ్యత బీఎల్‌ఏదేనని శాసనమండలి సభ్యురాలు,అన్నమయ్య జిల్లా బీఎల్‌ఏ పరిశీలకురాలు టీ.కల్పలతారెడ్డి అన్నారు. శుక్రవారం రాజంపేట మండలం ఆకేపాటి ఎస్టేట్‌లో ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ బీఎల్‌ఏ విస్తృత స్ధాయి సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటర్ల జాబితాయే వైఎస్సార్‌సీపీ గెలుపునకు తొలి అడుగు అని అన్నారు. బీఎల్‌ఏలు తమ పరిధిలోని ఓటర్ల జాబితాపై పట్టు సాధించాలన్నారు. వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఓట్లను రకరకాలుగా తొలిగించేందుకు టీడీపీ నాయకులు కుట్రలు చేసేందుకు ప్రయత్నిస్తారన్నారు. దానిని బీఎల్‌ఏలు అడ్డుకోవాలన్నారు. మళ్లీ 2029లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్న ధ్యేయంతో ముందుకెళ్లాలన్నారు. ప్రతి ఒక్క బీఎల్‌ఏ సర్‌పై అవగాహన కలిగి ఉండాలన్నారు. సమావేశంలో రాజంపేట నియోజకవర్గ ఇన్‌చార్జి ఆకేపాటి అనిల్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్‌పోలా శ్రీనివాసులరెడ్డి, ఎంపీపీలు మేడా విజయభాస్కర్‌రెడ్డి, గాలివీటి రాజేంద్రరెడ్డి, కేంద్రకార్యాలయ పరిశీలకులు నరసింహారెడ్డి. ఎస్‌ఈసీ సభ్యుడు చొప్పాఎల్లారెడ్డి, రాయలసీమ బూత్ కమిటి కన్వీనరు తల్లెం భరత్‌కుమార్‌రెడ్డి, జిల్లా బూత్‌కమిటి నేత నడివీధి సుధాకర్, మండలకన్వీనర్లు టక్కోలు శివారెడ్డి, దొడ్డిపల్లెభాస్కర్‌రాజు, జె. కృష్ణరావుయాదవ్, నీలకంఠేశ్వరరెడ్డి, సిద్ధవరం గోపిరెడ్డి,బెహరన్ వైఎస్సార్‌సీపీ కన్వీనరు ఓర్సు నాగరాజు, నాయకులు గొబ్బిళ్ల త్రినాధ్,పాపినేని విశ్వనాధరెడ్డి, దండుగోపి,వడ్డెరమణ, మహిళనేతలు ఏకులరాజేశ్వరీరెడ్డి, రక్కాసి శ్రీవాణి, పల్లె మాధవి పాల్గొన్నారు.
సర్‌పై బీఎల్‌ఏలు అప్రమత్తంగా వ్యవహరించాలి. నియమ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలి.ఓట్లు తొలగింపునకు గురికాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత బీఎల్‌ఏలదే. స్థానికసంస్ధలలో వైఎస్సార్‌సీపీ సత్తా చాటుకునేందుకు సమష్టిగా కృషిచేయాలి. బూత్ స్ధాయిలో వైఎస్సార్‌సీపీ ఓట్లకు గండిపడకుండా చూసుకోవాలి. – సురేష్‌బాబు, వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ పరిశీలకుడు
ఒక ఓటు కూడా పొగొట్టుకోకూడదు. ఆ దిశగా బీఎల్‌ఏలు పనిచేయాలి. సర్‌లో బీఎల్‌ఏలదే కీలకపాత్ర.అది గుర్తుంచుకోవాలి. చంద్రబాబుకు బుద్ధి చెప్పేరోజులు దగ్గరలో ఉన్నాయి. ఇటీవల పలు రాష్ట్రాలలో ఓట్ల తొలగింపుతో నేతలు ఓటమి పాలయ్యారు. అందువల్ల ఓట్ల తొలిగింపునకు అడ్డుకట్టవేసే విధంగా బీఎల్‌ఏలు పనిచేయాలి. – ఆకేపాటి అమరనాఽథరెడ్డి, ఎమ్మెల్యే, రాజంపేట
స్థ్ధానిక సంస్ధల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురాలి.సమష్టిగా గెలుపునకు కృషిచేయాలి. ప్రజలకు వెన్నుపోటు పొడిచిన సీఎం చంద్రబాబు మోసపూరిత పాలనను ప్రజలు గ్రహించారు.రెండేళ్లలో హామీలు నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రె డ్డిని మళ్లీ సీఎంను చేసుకోవాలంటే బీఎల్‌ఏలు కీలకపాత్ర పోషించాలి. ఓట్ల తొలిగింపుకు కుట్రలు తెరలేస్తాయి. వాటిని అడ్డుకొని మన ఓట్లను కాపాడుకోవాలి. – మేడా రఘునాథరెడ్డి, రాజ్యసభ సభ్యుడు
వైఎస్సార్ చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న నాయకులు


