కమలాపురం: కమలాపురం పట్టణంలో వెలసిన దర్గా–ఏ–గఫారియా, జహీరియా స్వర్గీయ పీఠాధిపతి హాజి జహీరుద్ధీన్ షా ఖాద్రి బర్సీ మహోత్సవం వైభవంగా జరిగింది. శుక్రవారం రాత్రి పీఠాధిపతి, సజ్జాద్–ఏ–నషీన్ ఫైజుల్ గఫార్ షా ఖాద్రి, దర్గా కన్వీనర్ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో బర్సీ మహోత్సవం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్త జన సందోహం నడుమ పీఠాధిపతి నివాసం నుంచి జహీరియా దర్గా వరకు గంధం ఊరేగింపు నిర్వహించారు. అనంతరం స్వామి వారి మజార్లపై గంధం ఎక్కించి, పూల చాదర్లు సమర్పించారు. ప్రత్యేక ఫాతెహ నిర్వహించారు. రాత్రి నాత్ చదివారు. అనంతరం బయాన్ చేశారు. పీఠాధిపతి సోదరులు దస్తగిరి షా ఖాద్రి, మౌలానా, గౌస్పాక్, జియా మాలిక్, సర్ఫరాజ్, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


