మైలవరం: మైలవరం మండలలో గురువారం రాత్రి గాలివాన గడగడలాడించింది. మండలంలోని తొర్రివేములు, నార్జాంపల్లి గ్రామాల్లో బొప్పాయి, అరటి, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. గ్రామాల్లో జంతువుల కోసం ఏర్పాటు చేసుకున్న షెడ్ల రేకులు గాలికి ఎగిరిపోయాయి. అదృష్టవశాత్తు ఎక్కడా ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రూ. 15 లక్షల వరకు పంట జరిగినట్లు రైతులు వాపోతున్నారు.పంట నష్టానికి సంబంధించి ప్రభుత్వానికి నివేదిక పంపించామని ఉద్యాన వన శాఖ అధికారి జయ భరత్‌రెడ్డి తెలిపారు.అరటి మూడు హెక్టార్లలో, బొప్పాయి 5.8 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు ఆయన చెప్పారు.


