కడప ఎడ్యుకేషన్: ఏపీ పీజీ సెట్–2026 ప్రవేశ పరీక్షల్లో జిల్లాకు చెందిన పలువురు ప్రతిభ చాటారు. జిల్లావ్యాప్తంగా 859 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 738 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో 658 మంది క్వాలిఫై అయి 89.16 శాతం ఉత్తీర్ణతను సాధించారు.
రాజంపేట: శేషాచల అటవీప్రాంతం రోళ్లమడుగులో శుక్రవారం ఓ తమిళ సినిమా షూటింగ్ ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇందులో ధనుష్, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. గ్రామంలోని ఎల్లమ్మ గుడి వద్ద నుంచి ఈ షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ మేరకు సెట్టింగ్స్ వేస్తున్నారు. ఎర్రచందనం స్లగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా చిత్రీకరిస్తునట్టుగా తెలుస్తోంది. రోళ్లమడుగు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎర్రచందనం చెట్లు విస్తారంగా ఉండటం వల్ల షూటింగ్ ఇక్కడ చేస్తున్నట్లు యూనిట్ సభ్యులు తెలిపారు.
కడప కార్పొరేషన్: వినియోగదారుల హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ స్టేట్ చైర్మన్ ఎం. సురేష్ బాబు అన్నారు. శుక్రవారం కడప శివారులో వున్న పాస్ట్రల్ సెంటర్ పరిధిలో యువతీ యువకులకు వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించారు. ఏదైనా వస్తువును కొనుగోలు చేసి ఉత్పత్తులను వినియోగించే వారికి కొన్ని మౌళిక హక్కులు ఉంటాయన్నారు. కొన్న వస్తువుకు సరైన బిల్లులు తీసుకోవడం, చలామణి తేదీలు పరిశీలించడం, నకిలీ వస్తువులను గుర్తించడం, తప్పిదాలపై ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేయడం వంటివి చేయాలన్నారు. కన్స్యూమర్ ఫోరమ్‌లో నష్ట పరిహారం కోసం ఎలా దాఖలు చేయాలి అన్న అంశం పై కూడా అవగాహన కల్పించారు. రూ.50వేల వరకూ నష్టపోతే జిల్లా కోర్టులో, రూ.2కోట్ల వరకూ నష్టపోతే రాష్ట్ర వినియోగదారుల కోర్టులో, ఆపైన జాతీయ వినియోగదారుల ఫోరంలో పరిహారం పొందవచ్చన్నారు. సెంటర్ డైరెక్టర్ పాస్టర్ వరప్రసాద్, కమిషన్ జిల్లా ఛైర్మెన్ కిశోర్, పాస్టర్లు ప్రసాద్, శరత్, సిస్టర్లు సౌరీలు, సీహెచ్ మేరీ, ప్రశాంతి, లిల్లీ పుష్ఫ, కస్పర్, లెక్చరర్ ప్రసన్న ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
గోదాములను
కడప కార్పొరేషన్/సెవెన్‌రోడ్స్: రైతులకు ఉపయోగపడేలా ఎంపీఎఫ్‌సీ గోదాములను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో బహుళ ప్రయోజన సదుపాయ కేంద్రాల గోదాముల ఏర్పాటుకు సంబంధించి జిల్లాస్థాయి అమలు కమిటీ సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.
కడప అర్బన్: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం – ఎస్‌ఐఆర్ 2026 ను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రతి రాజకీయ పార్టీ ప్రతినిధులు, ఎన్నికల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని బోర్డు మీటింగ్ హాలులో జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్పెషల్ ఇన్టెన్సివ్ రివిజన్ – ఎస్‌ఐఆర్ 2026 పై జేసీ డి. నిధి మీనా, డిఆర్వో మల్లికార్జునుడులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియలో ఓటరు జాబితాల సమగ్రత అత్యంత కీలకమని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఖచ్చితమైన ఓటరు జాబితాలు అవసరమని, అందుకే భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా వెలుపల ఉండకూడదనే దానితో పాటు, అనర్హుల పేర్లు జాబితాలో ఉండకుండా చూడడమేనని తెలిపారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం గత ప్రత్యేక సమగ్ర సవరణలో నమోదైన వివరాలకు ప్రామాణికత కల్పించబడుతుందని చెప్పారు. ఎవరైనా పేరు తొలగించే ముందు తప్పనిసరిగా వినతులు స్వీకరించి విచారణ జరిపి మాత్రమే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు నియమించే బూత్ లెవల్ ఏజెంట్లు (బిఎల్‌ఏ) కూడా ఈ ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ కోరారు.


