డీఎస్సీలో భారీ అక్రమాలు | - | Sakshi
Sakshi News home page

డీఎస్సీలో భారీ అక్రమాలు

May 30 2026 2:44 AM | Updated on May 30 2026 2:44 AM

కడప సెవెన్‌రోడ్స్‌: డీఎస్సీలో జరిగిన భారీ అక్రమాలపై రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులు శుక్రవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ విభాగ జిల్లా అధ్యక్షుడు పసుపులేటి సాయిదత్త, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామలక్ష్మణ్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి సందీప్‌రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. మంత్రి లోకేష్‌ను తక్షణమే క్యాబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. డీఎస్సీ పరీక్షా పేపర్లు లీక్‌ అయ్యాయని ఆరోపించారు. డేటా కూడా డెలీట్‌ చేయడం, మెరిట్‌ లిస్టు మాయం చేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు. స్పోర్ట్స్‌ కోటా కింద ఒక్కో పోస్టుకు రూ. 15 లక్షలు వసూలు చేశారని ఆరోపించారు. ఫేక్‌ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇచ్చారన్నారు. పరీక్షలు పారదర్శకంగా నిర్వహించకపోగా, అవినీతికి గేట్లు తెరిచారని దుయ్యబట్టారు. నిరుద్యోగులకు జరిగిన ఈ అన్యాయం క్షమించరానిదన్నారు. నిరుద్యోగులకు తాము అండగా నిలుస్తామని, డీఎస్సీ అక్రమాలు సరిదిద్దే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ, విద్యార్థి విభాగం నియోజకవర్గ అధ్యక్షులు గుమ్మళ సాయికుమార్‌రెడ్డి, నాయకులు బాలకృష్ణ, డేవిడ్‌, శివారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు మహేష్‌రెడ్డి, రుద్రసేనారెడ్డి, శ్యాం, రాయుడులతోపాటు నగర కమిటీ సభ్యులు, కాలేజీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్‌ ఏఓ గంగయ్యకు వినతిపత్రమిచ్చారు.

ఫోటోనెం. 29కెడిపి601, 602, 603– కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహిస్తున్న వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులు, పార్టీ నేతలు

కెడిపి604 – కలెక్టరేట్‌ ఏఓకు వినతిపత్రం సమర్పిస్తున్న విద్యార్థి విభాగం నాయకులు

మంత్రి లోకేష్‌ను బర్తరఫ్‌ చేయాలి

కలెక్టరేట్‌ ఎదుట వైఎస్సార్‌ సీపీవిద్యార్థి విభాగం ధర్నా

Advertisement
 
Advertisement
Advertisement