చిన్నారికి పునర్జన్మను ప్రసాదించండి | - | Sakshi
Sakshi News home page

చిన్నారికి పునర్జన్మను ప్రసాదించండి

May 30 2026 2:44 AM | Updated on May 30 2026 2:44 AM

చిన్నారికి పునర్జన్మను ప్రసాదించండి

ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణంలోని వైఎంఆర్‌ కాలనీ భవాని నగర్‌కు చెందిన జంబుబోయిన కాశీ విశ్వనాథ్‌, బాల లింగమ్మల కుమారుడు వర్షిత్‌ నాథ్‌కు అరుదైన జబ్బు సోకింది. వీరికి ముగ్గురు కుమార్తెలతోపాటు నాలుగో సంతానంగా వర్షిత్‌ నాథ్‌ జన్మించాడు. వీరిది మేనరికం వివాహం. తల్లిదండ్రులు హోటల్‌ను నిర్వహించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వర్షిత్‌ నాథ్‌ పుట్టిన తొలి ఆరు నెలలు అందరిలాగే చిరునవ్వులు చిందిస్తూ ఉండేవాడు. క్రమేణా నరాల జబ్బు కారణంగా నిల్చోలేని పరిస్థితి వచ్చింది. బాబు పరిస్థితిని గమనించిన తల్లిదండ్రులు ఆస్పత్రుల చుట్టూ తిరిగే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో హోటల్‌నూ మూసివేశారు. ఈ నెల 14న హైదరాబాద్‌ రెయిన్‌బో ఆస్పత్రికి బాలుడిని తీసుకెళ్లగా.. అక్కడ బాలుడికి జనటిక్‌ పరీక్షలు చేయించారు. ‘మీ బాబుకు మోటార్‌ ఆక్జోనల్‌ న్యూరోపతి జబ్బు వచ్చిందని’ అక్కడి డాక్టర్‌ గీత చందా చెప్పినట్లు వారు తెలిపారు. బాబు వయసు ప్రస్తుతం 14 నెలలు.. రెండేళ్లలోపు బాబుకు వ్యాక్సిన్‌ వేయించాలని వైద్యులు సూచించారు. అంత వరకు తాత్కాలికంగా మందులు ఇచ్చారు.

పునర్విక తరహాలోనే

రూ.16 కోట్ల విలువైన టీకా వేయాల్సిందే

పునర్విక తరహాలోనే తమ బాబుకు రూ.16కోట్ల విలువైన ఇంజక్షన్‌ వేయించాలని వైద్యులు సూచించినట్లు తల్లిదండ్రులు కాశీవిశ్వనాథ్‌, బాలలింగమ్మ తెలిపారు. మానవతా హృదయంతో స్పందించి తమ బాబుకు పునర్జన్మను ప్రసాదించాలని వారు వేడుకుంటున్నారు. 7095148237 నంబర్‌కు దాతలు ఫోన్‌ పే చేయాలని తల్లిదండ్రులు కోరారు.

14 నెలల బాబుకు నరాల జబ్బు

పునర్విక తరహాలోనే ఆదుకోవాలని తల్లిదండ్రుల వేడుకోలు

Advertisement
 
Advertisement
Advertisement