కడప కార్పొరేషన్: కడపలో రెండు రోజులపాటు నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో కడప మున్సిపల్ కార్పొరేషన్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న రాజశేఖర్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రభుత్వ సంస్థలో పనిచేస్తూ ఒక రాజకీయ పార్టీ మీటింగ్‌లో పాల్గొని, టీడీపీ నాయకులతో చెట్టాపట్టాలు వేసుకొని ఫొటోలకు ఫోజులు ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అతనిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


