● టి.రామాపురం దగ్గరప్రభుత్వ భూమి ఆక్రమణ
● తెలుగుగంగ ముంపువాసులకుకేటాయించిన 32 ఎకరాలు కబ్జా
● పట్టించుకోని అధికారులు
బ్రహ్మంగారిమఠం: మండలంలోని రేకలకుంట పంచాయతీ టి.రామాపురం పరిధిలో ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కరువైంది. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములతో పాటు గ్రామాలకు జీవనాధారమైన చెరువులు భూబకాసురుల పాలవుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
● బద్వేల్–మైదుకూరు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 470లోని 32 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమి ప్రస్తుతం అక్రమార్కుల చేతుల్లో చిక్కింది. గత 1987లో అప్పటి ప్రభుత్వం తెలుగుగంగ ప్రాజెక్టు ముంపు బాధితుల ఇళ్ల స్థలాల (ఆర్ అండ్ ఆర్ సెంటర్) కోసం ఈ భూమిని కేటాయించింది. అప్పట్లో కొందరు లబ్ధిదారులకు 3 సెంట్ల చొప్పున ఇళ్ల పట్టాలు ఇచ్చారు. అయితే, ముంపు బాధితులు జిల్లాలోని ఇతర ప్రాంతాలలో స్థిరపడటంతో ఈ స్థలాలను వారు ఉపయోగించుకోలేదు.దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు స్థానికులు కడప, బద్వేల్, మైదుకూరు పట్టణాలకు చెందిన ప్రైవేట్ వ్యక్తులను ఇక్కడికి తీసుకువచ్చి ఆక్రమణలను ప్రోత్సహించారు. దీనిపై గ్రామస్తులు తిరగబడి ఆర్ అండ్ ఆర్ సెంటర్‌ను రద్దు చేయించినప్పటికీ ఆక్రమణల పర్వం ఆగలేదు.
కోటి నిధులు వృథా!
‘వాంపల్లె చెరువు’ సైతం ఆక్రమణదారుల చేతుల్లో చిక్కింది.72 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ చెరువు, ప్ర స్తుతం డి.అగ్రహారం, టి.రామాపురం, వాంపల్లె గ్రామాలకు చెందిన కొందరి కబ్జాల కారణంగా 10 ఎకరాలకే పరిమితమైంది. గత ప్రభుత్వ హయాంలో ఈ చెరువు కట్ట పునరుద్ధరణ కోసం రూ. కోటి నిధులు ఖర్చు చేశారు. అయితే, ఈ నిధులన్నీ బూడిదలో పోసిన పన్నీరుగా మారాయి. వర్షాలు పడినప్పుడు చె రువులోకి నీరు చేరితే.. తాము ఆక్రమించుకున్న పొ లాలు మునిగిపోతాయనే స్వార్థంతో, అక్రమార్కులు చెరువు తూములను పైకి ఎత్తారు. దీనివల్ల వర్షపు నీరు వృథాగాపోతున్నా మైనర్ ఇరిగేషన్ అధికారులు పట్టి ంచుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


