జూన్‌ 17 నుంచి కడపలో ఏపీఎల్‌ పోరు | - | Sakshi
Sakshi News home page

జూన్‌ 17 నుంచి కడపలో ఏపీఎల్‌ పోరు

May 29 2026 2:25 AM | Updated on May 29 2026 2:25 AM

జూన్‌ 17 నుంచి కడపలో ఏపీఎల్‌ పోరు

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌: ఆంఽధ్రా ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌) టోర్నీ వచ్చేనెల 9వ తేదీ నుంచి జరగనుంది. తొలిసారిగా ఈ పోటీలను రాష్ట్రంలోనే మూడు వేర్వేరు వేదికల్లో నిర్వహించనున్నారు. ఈ ఏడాది విశాఖపట్నం తో పాటు కడప మంగళగిరి స్టేడియాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

కడప వేదికగా తొమ్మిది మ్యాచ్‌లు ....

జూన్‌ 17 నుంచి 21వ తేదీ వరకు ఐదు రోజులపాటు మొత్తం ఇక్కడ 9 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. వైయస్‌ఆర్‌ఆర్‌ ఏసీఏ క్రికెట్‌ స్టేడియం ఈ మ్యాచ్‌లకు వేదిక కానుంది. స్టేడియంలో సుమారు మూడు సంవత్సరాల క్రితం దాదాపు 8 కోట్లతో ఫ్లడ్‌లైట్లను ఏర్పాటు చేశారు. అయితే వాటిలో ఒక మ్యాచ్‌ కూడా నిర్వహించలేదు. త్వరలో ఫ్లడ్‌ లైట్ల వెలుగులో ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ మ్యాచ్‌లను నిర్వహించేలా జిల్లా క్రికెట్‌ సంఘం చేసిన కృషి ఫలించింది.

స్టేడియంలో ఉన్న మ్యాచ్‌ల షెడ్యూల్‌ ఇలా...

● జూన్‌ 17– విజయవాడ సన్‌ షైనర్స్‌ వర్సెస్‌ తుంగభద్ర వారియర్స్‌.

● 18న మధ్యాహ్నం కాకినాడ కింగ్స్‌వర్సెస్‌ రాయల్స్‌ ఆఫ్‌ రాయలసీమ, సాయంత్రం: క్యాపిటల్‌ అమరావతి రాయల్స్‌వర్సెస్‌ సింహాద్రి వైజాగ్‌ లయన్స్‌.

● 19న మధ్యాహ్నం భీమవరం బుల్స్‌ వర్సెస్‌ విజయవాడ షైనర్స్‌, సాయంత్రం సింహాద్రి వైజాగ్‌ లయన్స్‌ వర్సెస్‌ రాయల్‌ ఆఫ్‌ రాయలసీమ.

● 20న మధ్యాహ్నం తుంగభద్ర వారియర్స్‌ వర్సెస్‌ భీమవరం బుల్స్‌, సాయంత్రం క్యాపిటల్‌ అమరావతి రాయల్స్‌ వర్సెస్‌ కాకినాడ కింగ్స్‌.

● 21న మధ్యాహ్నం రాయల్స్‌ ఆఫ్‌ రాయలసీమ వర్సెస్‌ తుంగభద్ర వారియర్స్‌, సాయంత్రం కాకినాడ కింగ్స్‌ వర్సెస్‌ విజయవాడ సన్‌షైనర్స్‌.

మూడు వేదికల్లో ఐదో సీజన్‌ నిర్వహణ

మంగళగిరిలో ఫైనల్స్‌

Advertisement
 
Advertisement
Advertisement