● మహా‘ఖర్చు’ గురూ! | - | Sakshi
Sakshi News home page

● మహా‘ఖర్చు’ గురూ!

May 29 2026 2:25 AM | Updated on May 29 2026 2:25 AM

● మహా‘ఖర్చు’ గురూ!

ఖర్చులు తగ్గించాలని టీడీపీ వర్చువల్‌ మహానాడు నిర్వహించింది. ఇప్పుడా ఖర్చు అత్యధికంగా కేడర్‌పై పడిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యధిక ప్రాంతాలల్లో ఆయా కేడరే ఖర్చులను భరించాల్సి వచ్చింది. తొలిరోజు మహానాడు విఫలం కావడంతో రెండోరోజు జనాన్ని సమీకరించుకోవాల్సిన బాధ్యత కూడా స్థానిక కేడర్‌పై పడింది. స్థానికంగా జనసమీకరణకు ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జిలు కేడర్‌పైనే భారం వేయడంతో ఖర్చులు మరింతగా పెరిగాయి. జిల్లా వ్యాప్తంగా 78క్లస్టర్లల్లో వర్చువల్‌ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి స్క్రీన్స్‌ ఏర్పాటు, ఫ్లెక్సీల హంగామా, ఫంక్షన్‌ హాల్‌ బాడుగు, జనసమీకరణ, భోజనం ఇలా సరాసరిగా ఒక్కొక్క క్లస్టర్‌లో రూ.2లక్షలు ఖర్చు లభించింది. దాదాపు రూ.1.5కోట్లు కేడర్‌ భరించాల్సి వచ్చింది. డిజిటల్‌ వేదిక పేరుకే ఖర్చులు తగ్గించేందుకు ఏర్పాటు చేసినట్లు చెప్పుకున్నారని పలువురు వాపోతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement