వేముల: ప్రకృతి వైపరీత్యాలతో దెబ్బతిన్న అరటి పంట నష్టంపై ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి మీదిపెంట్ల గ్రామంలో గాలివానతో నేలవాలిన అరటి తోటలను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి బీభత్సానికి పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. గ్రామ స్థాయి యూనిట్‌గా ఇన్సూరెన్స్ వర్తించేలా వాతావరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం పంట నష్టంపై రైతులను అడిగి తెలుసుకున్నారు. గాలివానతో దెబ్బతిన్న పంట నష్టాన్ని అంచనా వేసి నివేదిక ఇవ్వాలని ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే మండలంలోని గొందిపల్లె గ్రామంలో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటర్ల మ్యాపింగ్ పక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడి ఎన్యుమరేషన్‌లో ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అలాగే ఏయే పంటలు సాగు చేశారనే విషయాలను గ్రామస్తుల ద్వారా తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ మల్లికార్జునుడు, ఆర్డీఓ చిన్నయ్య, డీహెచ్‌ఓ సతీష్‌కుమార్, డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి, పీఆర్ ఎస్‌ఈ మద్దన్న, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ ఏడు కొండలు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్


