ఒక్క మే నెలలోనే జిల్లాలో మూడు సార్లు ఈదురుగాలులతోపాటు కురిసిన అకాల వర్షాలకు వందల హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. మే 1వ తేదీ వచ్చిన ఈదురుగాలులతోపాటు అకాల వర్షాలకు జిల్లాలోని లింగాల, పులివెందుల, చక్రాయపేట, దువ్వూరు, రాజంపేట మండలాల్లో 490 మంది రైతులకు చెందిన 484 హెక్టార్లలో అరటి, 9 హెక్టార్లలో బొప్పాయి, 12 హెక్టార్లలో మామిడి, 10 హెక్టార్లలో నారింజ పంటలు దెబ్బతిని 179.35 లక్షల మేర రైతులకు నష్టం వాటిల్లింది.
● ఈ నెల 22న కురిసిన వర్షాలతో పాటు ఈదురు గాలులకు లింగాల, పులివెందుల, వేముల, వేంపల్లి, ఎర్రగుంట్ల మండలాల పరిధిలో 705 మంది రైతులకు చెందిన 665.60 హెక్టార్లలో ఆరటి, నిమ్మ, తదితర పంటలు దెబ్బతిని రూ. 2.31 కోట్ల మేర నష్టం వాటిల్లింది. తాజాగా 26వ తేదీ రాత్రి కురి సిన అకాల వర్లం, ఈదురు గాలులకు పెద్దముడియం, ఖాజీపేట, దువ్వూరు, లింగాల, పులివెందుల, వేముల మండలాల పరిధిలోని 271 మంది రైతులకు సంబంధించి 255.40 హెక్టార్లలో అరటి, బొప్పాయి, నిమ్మ, మునగ పంటలు దెబ్బతిని రూ. 89.27 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు ఉద్యాన శాఖ అధికారులు ప్రాథ మిక నష్టపరిహార అంచనాలను పంపారు.


