సీపీఎల్‌–2 ఫైనల్లో పాయ్‌ వైస్రాయ్‌ జట్టు | - | Sakshi
Sakshi News home page

సీపీఎల్‌–2 ఫైనల్లో పాయ్‌ వైస్రాయ్‌ జట్టు

May 28 2026 1:58 AM | Updated on May 28 2026 1:58 AM

సీపీఎల్‌–2 ఫైనల్లో పాయ్‌ వైస్రాయ్‌ జట్టు

వాల్మీకిపురం: స్థానిక జీవీఎస్‌సీఎస్‌ క్రీడామైదానంలో జరుగుతున్న సీపీఎల్‌ సీజన్‌ 2లో పాయ్‌ వైస్రాయ్‌ జట్టు ఫైనల్‌కు చేరింది.బుధవారం జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఆదిత్య బిఆర్‌ జట్టుపై విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ప్రారంభించిన పాయ్‌ వైస్రాయ్‌ జట్టు 20 ఓవర్లలో 151 పరుగులు చేసింది. ఈ జట్టులో జహీర్‌ అబ్బాస్‌ 28 బంతుల్లో 54 పరుగు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌ ప్రారంభించిన దిత్య బిఆర్‌ జట్లు 147 పరుగులకే ఆలౌలైంది. జహీర్‌ అబ్బాస్‌కు జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీధర్‌, సెక్రటరీ సతీష్‌ యాదవ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement