తృటిలో తప్పిన ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

తృటిలో తప్పిన ప్రమాదం

May 28 2026 1:58 AM | Updated on May 28 2026 1:58 AM

ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం వెనుక వైపు ఉన్న కడప–చైన్నె జాతీయ రహదారిపై బుధవారం కారు ను లారీ ఢీ కొన్న ప్రమాదంలో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల వివరాల మేరకు.. ఆళ్లగడ్డకు చెందిన కొంత మంది పుల్లంపేట సమీపంలోని ఓ గ్రామంలో నిశ్చయతాంబూల కార్యక్రమానికి వెళ్లి తిరిగి ఒంటిమిట్ట రామాలయంలో స్వామి వారిని దర్శించుకుని తిరిగి ఆళ్లగడ్డ కు ప్రయాణం ప్రారంభించారు. ఈ క్రమంలో రామాలయం వెనుక వైపు కడప–చైన్నె జాతీయ రహదారిని దాటుతుండగా కడప వైపు నుంచి వస్తున్న లారీ ఢీ కొట్టడంతో కారు ముందు భాగం దెబ్బతింది. కారులో ప్రయాణిస్తున్న 5 మందిలో ఒక మహిళకు స్వల్ప గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న ఒంటిమిట్ట ఎస్‌ఐ శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు.

పోలీసుల అదుపులో

అదృశ్యం అయిన వ్యక్తి

కడప అర్బన్‌ : తెలంగాణ రాష్ట్రం మల్కాజ్‌ గిరి జిల్లా జవహర్‌ నగర్‌ పీ.ఎస్‌ పరిధిలో 24 గంటల క్రితం అదృశ్యమైన నంగునూరు వెంకటేశం (52) అనే వ్యక్తిని కడప ఆర్టీసీ బస్టాండ్‌ లో ఉన్నట్లు కుటుంబ సభ్యులు కడప వన్‌ టౌన్‌ సీఐ చిన్న పెద్దయ్యకు ఫోన్‌ చేసి సమాచారమిచ్చారు. దీంతో సీఐ చిన్నపెద్దయ్య, చిన్నచౌకు సీఐ రామకృష్ణారెడ్డికి సమాచారమిచ్చారు. మిస్సింగ్‌ వ్యక్తిని సురక్షితం చేసి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. తెలంగాణా రాష్ట్రం కాప్రా మండలం అంబేడ్కర్‌ నగర్‌ కాలనీకి చెందిన నంగునూరు వెంకటేశం (52) ఓ ప్రైవేట్‌ సంస్థలో పనిచేసేవాడు. విధుల నిమిత్తం ఇంటి నుండి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని ఫోన్‌ స్విచాఫ్‌ వస్తోందని కుటుంబ సభ్యులు జవహర్‌ నగర్‌ పీ.ఎస్‌ లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సదరు మిస్సింగ్‌ వ్యక్తి కడప ఆర్టీసీ బస్‌ స్టాండ్‌ లో ఉన్నట్లు కుటుంబ సభ్యులు కడప పోలీసులకు సమాచారమివ్వడంతో ఆయనను తమ సంరక్షణలోకి తీసుకున్నారు.

రైలు కిందపడి వ్యక్తి మృతి

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : కడప – కృష్ణాపురం రైల్వే స్టేషన్ల మధ్య రైలు కింద పడి అన్న మయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలానికి చెందిన షేక్‌ హుసేన్‌ బాష మృతి చెందాడని రైల్వేపోలీసులు తెలిపారు. షేక్‌ హుస్సే న్‌ ఆత్మహత్యకు పాల్పడగా, తల మొండెం వేరువేరైనట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఈ మేరకు వారు లక్కిరెడ్డిపల్లి పోలీసులకు సమాచారం అందించారు.

దళిత మహిళపై దాడి

మదనపల్లె టౌన్‌ : దళిత మహిళపై దాడి చేసిన ఘటన బుధవారం కురబలకోట మండలం ముదివేడులో వెలుగు చూసింది. ముదివేడుకు చెందిన బి. రాజమ్మ (50) తమ ఇళ్ల ముందు నుంచి వెళ్లకూడదని అదే వీధిలో నివసించే ఆఫ్సల్‌, హసీనా, షాహిన తదితరులు ఆమెను అడ్డుకున్నారు. పూర్వీకుల నుంచి వాడుకలో ఉన్న దారిలో పోకుండా మరే దారిలో వెళ్లాలని రాజమ్మ ప్రశ్నించడంతో ఆగ్రహించిన పలు వురు ఆమైపె మూకుమ్మడిగా దాడి చే శారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement