లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి ఐదేళ్ల జైలు | - | Sakshi
Sakshi News home page

లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి ఐదేళ్ల జైలు

May 28 2026 1:58 AM | Updated on May 28 2026 1:58 AM

కడప అర్బన్‌ : జిల్లాలోని చెన్నూరు మండలంలో మైనర్‌ బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించి, లైంగిక వేధింపులకు గురిచేసిన నిందితుడు గొడ్లవీటి ఈశ్వరయ్య(36)కు జైలు శిక్ష విధించారు. కడప పోక్సో కోర్టు న్యాయమూర్తి ఎంఏ సోమ శేఖర్‌ కేసు విచారించి నిందితుడు గొడ్లవీటి ఈశ్వరయ్యకు 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 3,000 జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించారు. చెన్నూరు పీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ షేక్‌ చాంద్‌ బాషా ఈ కేసు వివరాలను, కోర్టు వెలువరించిన తీర్పును మీడియాకు వెల్లడించారు. చెన్నూరు మండలానికి చెందిన మైనర్‌ బాలిక(8) పై 2022 డిసెంబర్‌ 12న లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు చెన్నూరు పోలీస్‌ స్టేషన్‌న్‌లో చెన్నూరు మండలం కొక్కరాయపల్లి గ్రామానికి చెందిన గొడ్లవీటి ఈశ్వరయ్య పై కేసు నమోదు చేశారు. కేసును సమగ్రంగా విచారించిన న్యాయమూర్తి నిందితుడికి జైలు శిక్ష విధించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్‌ తరఫున స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కొమ్మినేని వేణుగోపాల్‌ సమర్థవంతంగా కేసును వాదించారు. నేరస్తుడికి శిక్ష పడేలా కృషి చేసిన సిబ్బంది ని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement