కడప సెవెన్‌రోడ్స్: పవిత్ర బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని కడప జిల్లా వ్యాప్తంగా ముస్లింలు పండుగ ఏర్పాట్లలో మునిగిపోయారు. పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని రకాల పటిష్ట చర్యలు చేపట్టింది.
ఈద్గాల వద్ద ప్రత్యేక వసతులు: కడప నగరంలోని బిల్టప్ సమీపంలో గల ప్రధాన ఈద్గా వద్ద మైనార్టీ సంక్షేమ, పోలీస్, రెవెన్యూ, కార్పొరేషన్ శాఖల అధికారులు సంయుక్తంగా విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎండ తీవ్రత తగలకుండా భారీ చలువ పందిళ్లను నిర్మించారు. ప్రార్థనలకు వచ్చే వారి కోసం తాగునీటి సదుపాయంతో పాటు, వజూ (శుభ్రత) చేసుకోవడానికి అవసరమైన నీటి వసతిని కల్పించారు. నగర శివార్లలోని ఈద్గాలు. మసీదులు కూడా ప్రార్థనల కోసం సిద్ధమవుతున్నాయి.
పీఠాధిపతుల ఆధ్వర్యంలో ప్రార్థనలు
బక్రీద్ పండుగ రోజున పెద్దదర్గా మసీదులో తొలుత పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ ప్రత్యేక ప్రార్థనలు జరపనున్నారు. అనంతరం బిల్టప్ ఈద్గాలో ముఖ్య ప్రార్థనలు జరుగుతాయి. మరోవైపు, దండు ఈద్గాలో మురాదియా పీఠాధిపతి ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనల నిర్వహణకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
కొనుగోళ్లతో సందడిగా మార్కెట్లు
ç³…yýl$VýS çÜÒ$-í³…-^èl-yýl…™ø ¯]lVýS-Æý‡…ÌZ° {ç³Ð]l¬Q Ðé×ìæ-fÅ Ò«§ýl$-OÌñæ¯]l OÐðlÒ [ïÜtsŒæ, ½MóS-G… [ïÜtsŒæ-ÌS™ø ´ër$ BÈtシー ºÝët…yŠæ ç³Ç-çÜ-Æ>ÌZϰ Úëí³…VŠæ Ð]l*â¶æ$Ï Ñ°-Äñæ*-VýS-§é-Æý‡$ÌS™ø ´ùsñæ-™é¢Æ‡$$. Æð‡yîl-Ðól$yŠæ §ýl$çÜ$¢Ë$, Ð]l$íßæ-âýæÌS AÌS…MýS-Æý‡×æ ÝëÐ]l$-{W, Ððl$çßæ…© Mø¯]l$Ï, ´ë§ýl-Æý‡-„ýSË$, Æý‡MýS-Æý‡-M>ÌS yìlOgñæ¯]lÏ V>kÌS Mö¯]l$Vøâ¶æ$Ï gZÆý‡$V> ÝëV>Ƈ$$. Æ>{† ´÷§ýl$ª´ùÄôæ$ Ð]lÆý‡MýS$ ÐéÅ´ëÆ>Ë$ ÝëVýS-yýl…™ø §ýl$M>-׿-§é-Æý‡$Ë$ çßæÆý‡Û… Ð]lÅMýS¢… ^ólçÜ$¢-¯é²Æý‡$.
పటిష్ట నిఘా – కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ఈ నెల 28వ తేదీన జరగనున్న పండుగను పురస్కరించుకుని పశువుల అక్రమ రవాణా, సోషల్ మీడియాలో వచ్చే నకిలీ పోస్టులపై జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక నిఘా ఉంచిందని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రజలు ఎలాంటి ఫిర్యాదులు లేదా సమాచారాన్నైనా అందించేందుకు కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని, ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్: 08562 246344కు ఫోన్ చేసి వివరాలు తెలియజేయవచ్చని కలెక్టర్ వివరించారు.
ప్రార్థనలకు సిద్ధమైన కడప ఈద్గాలు
పీఠాధిపతుల ఆధ్వర్యంలోబక్రీద్ ప్రత్యేక ప్రార్థనలు
పండుగకు ముమ్మర ఏర్పాట్లు
కొనుగోళ్లతో కిటకిటలాడుతున్న మార్కెట్లు
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
పటిష్ట నిఘా పెట్టిన పోలీసులు


