మద్దతు ధరలు ఆచరణలో అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

మద్దతు ధరలు ఆచరణలో అమలు చేయాలి

May 27 2026 5:56 AM | Updated on May 27 2026 5:56 AM

‘ప్రభుత్వం ప్రకటిస్తున్న మద్దతు ధరలు దళారులకే అందుతున్నాయి తప్ప సామాన్య రైతులకు చేరడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు రైతులకు కొంత వరకు ఉపశమనం కలగాలంటే ఖచ్చితంగా ఆచరణలో అమలు జరగాలి.‘ – మోహన్‌రెడ్డి, రైతు,

సుంకేసుల, ఖాజీపేట మండలం

ధరలు ఏమాత్రం గిట్టుబాటు కావు

‘ఏటా సాగు ఖర్చులు భారీగా పెరుగుతున్నా, మద్దతు ధరలు మాత్రం అంతంతే పెరుగుతున్నాయి. దీంతో మద్దతు ధరలు ఆశాజనకంగా లేకపోవడం వల్ల రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి ఖర్చును, రైతు కుటుంబ కష్టాన్ని దృష్టిలో ఉంచుకుని మద్దతు ధరలను ప్రకటించాలి.‘ – దస్తగిరిరెడ్డి,

ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి

ఖర్చులకు అనుగుణంగా

ధరలు లేవు

‘రైతుల వాస్తవ ఖర్చులను పరిగణనలోకి తీసుకోకుండా మద్దతు ధరలు ప్రకటించడం వలన అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. వరికి క్వింటాల్‌కు కేవలం రూ. 72 మాత్రమే పెంచి చేతులు దులుపుకుంది. జొన్న, మొక్కజొన్న, వేరుశనగ, రాగులు ఇలా అన్నింటికి మద్దతు ధరను రూ. 5 వందల లోపు పెంచడం రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కాదు.‘ – సంబటూరు ప్రసాద్‌రెడ్డి,

వైఎస్సార్‌ సీపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు

Advertisement
 
Advertisement
Advertisement