న్యాయ సేవలపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

న్యాయ సేవలపై అవగాహన

May 27 2026 5:56 AM | Updated on May 27 2026 5:56 AM

కడప అర్బన్‌ : రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ సి.యామిని సూచనల మేరకు జిల్లా న్యాయసేవాధికారసంస్థ సెక్రటరీ, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌.బాబా ఫకృద్దీన్‌ పారా లీగల్‌ వాలంటరీలకు, ఎన్‌జిఓలకు కడపలో న్యాయ సేవా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ లోక్‌ అదాలత్‌, పోక్సో చట్టం–2012, అంతర్జాతీయ తప్పిపోయిన పిల్లల దినోత్సవం అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ పారా లీగల్‌ వాలంటరీల పాత్ర, డ్రెస్‌ కోడ్‌, ప్రవర్తన, నీతి ప్రమాణాలు లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ యాక్ట్‌ 1987, రాజ్యాంగం ప్రవేశిక ప్రాథమిక హక్కులు ఆర్టికల్స్‌ 14, 15, 16, 19, 21, 22, ప్రాథమిక విధులు, కుటుంబ చట్టాలు, పిఎన్‌డిటి చట్టం, డివిసి చట్టంపై తెలియజేశారు. జువైనల్‌ జస్టిస్‌ చట్టం, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ పాత్ర జూనియర్‌ జస్టిస్‌ బోర్డు పాత్ర చట్టంతో పిల్లల సంఘర్షణ, మహిళలపై నేరాలు, పారా లీగల్‌ వలంటరీల విధులు, లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ విధులు, నల్సా పథకాలు, ఉచిత న్యాయ సహాయం మొదలైన అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్స్‌ న్యాయవాదులు, పారా లీగల్‌ వాలంటీర్స్‌, ఎన్‌జిఓలు, ప్రజలు పాల్గొన్నారు.

జూదరుల అరెస్ట్‌

కడప అర్బన్‌: కడప నగరం చిన్నచౌక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో ఖాళీ ప్రదేశంలో జూదమాడుతున్న 10 మందిని అరెస్ట్‌ చేసినట్లు చిన్నచౌక్‌ సీఐ రామకష్ణారెడ్డి తెలిపారు. కడప నగరంలోని ఎం.జెకుంట, సికేదిన్నె, పెండ్లిమర్రి, చెన్నూరు ప్రాంతాలకు చెందిన వారు జూదమాడుతున్నట్లు సమాచారం రావడంతో కడప ఇన్‌చార్జి డిఎస్పి బాలస్వామిరెడ్డి ఆదేశాల మేరకు సీఐ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. పది మందిని అరెస్ట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement