పులివెందుల :టీడీపీ నేతలు చేస్తున్న దోపిడీని ప్ర శ్నిస్తే ఎదురుదాడి చేయడమే వారు పనిగా పెట్టుకున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. అమరావతిలో కట్టే బిల్డింగ్‌ల అద్దాలకు రూ.41వేల కోట్లు అవుతోందని, అదే ఖర్చుతో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు రూ.4వేల కోట్లతో పూర్తవుతాయని తెలిపారు. సోమవారం పులివెందుల పట్టనంలోని స్థానిక భాకరాపురంలోని వైఎస్సార్ ఆడిటోరియంలో వైఎస్సార్‌సీపీ బూత్ లెవెల్ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితోపాటు పులివెందుల మున్సిపల్ ఇన్‌చార్జిలు వైఎస్ మనోహర్‌రెడ్డి, చవ్వా దుష్యంత్‌రెడ్డి, తొండూరు మండల ఇన్‌ఛార్జి వైఎస్ మధురెడ్డి, పార్లమెంటరీ ఇన్‌చార్జి అజయ్‌రెడ్డి, కోఆర్డినేటర్ చల్లా మధుసూదన్‌రెడ్డి, స్టేట్ సెక్రటరీ వజ్ర భాస్కర్‌రెడ్డి, జోనల్ ప్రెసిడెంట్ భరత్ కుమార్‌రెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు కల్లూరు నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ అమరావతిలో స్కేర్ ఫీట్‌కు రూ.20,400లు ఖర్చు పెడుతున్నారని, అవినీతి, అన్యాయమంటే జవాబు చెప్పరన్నారు. ఆరోగ్యశ్రీ అమలు లేదు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పిల్లల సర్టిఫికెట్ల కోసం డబ్బులు కట్టించుకుని మళ్లీ దోచుకుంటున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ గురించి అడిగితే సమాధానం చెప్పరన్నారు. ఇదే కూటమి ప్రభుత్వం ఎన్నికలప్పుడు పన్నులను తగ్గిస్తాం.. తద్వారా పెట్రోలు, డీజిల్ రేట్లు తగ్గిస్తామన్నారు.. ఎన్నికలు పూర్తయిన తర్వాత మనం ప్రశ్నించాం, నిరసనలు కూడా తెలియజేశాం. అయినా ముఖ్యమంత్రి కానీ, నాయకులు కానీ సమాధానం చెప్పరన్నారు. ఇక సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అన్నారు..బాబు ష్యూరిటీ – భవిష్యత్ గ్యారంటీ, 50ఏళ్లు దాటితే ఫించన్, 18ఏళ్ల నుంచి 50ఏళ్లు దాటిన మహిళలకు ఏడాదికి రూ.18వేలు ఇస్తామన్నారు, ఏ ఒక్క హామీ అమలు కావడంలేదన్నారు. వీటి గురించి ప్రశ్నిస్తే వారు ఎదురుదాడి చేయడం పనిగా పెట్టుకున్నారన్నారు.మీరు ఇచ్చిన హామిలు అమలు చేయండి, మీరు చేస్తోంది తప్పు అని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నిస్తే వారు దివంగత రాజారెడ్డి గురించి, దివంగత రాజశేఖరరెడ్డి గురించి మాట్లాడుతారన్నారు. లేకపోతే గొడ్డలి పార్టీ అని అంటారు. అసలు బుద్ధుందా చంద్రబాబూ.. నిజంగా వివేకానందరెడ్డి కేసులో తానే గొడ్డలి తీసుకుని నరికానని దస్తగిరి అనే వ్యక్తి అనేక చానెళ్లలో మీడియా ముందుకు వచ్చి చెప్పారని, అతన్ని నెత్తిమీద పెట్టుకొని మోస్తోంది మీ ప్రభుత్వం, మీ పార్టీ వాళ్లు కాదా అని ఎంపీ ప్రశ్నించారు. ఏ రకంగా మాది గొడ్డలి పార్టీ అవుతుంది.. మీది గొడ్డలి పార్టీ అవుతుందన్నారు.వెన్నుపోటు పార్టీ మీది, మామను వెన్నుపోటు పొడిచి పార్టీని చేజేక్కించుకున్నారని, నైతికంగా మన ప్రశ్నలకు సమాధానాలు చెప్పే దమ్ములేక చేతిలో ప్రభుత్వం, పోలీసులున్నారని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. మీరు మాట్లాడిన ప్రతి మాట మాలో కసి రగిల్చిందని, జవాబు చెప్పే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందని తెలియజేస్తున్నానని ఎంపీ పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఎల్‌ఏలు, నియోజకవర్గంలోని అన్ని మండలాల కన్వీనర్లు, పరిశీలకులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
అమరావతిలో కట్టే బిల్డింగ్‌ల అద్దాలకు అయ్యే ఖర్చుతో మెడికల్ కళాశాలలు పూర్తి చేయవచ్చు
తప్పులను సరిచేసుకోండంటే వాళ్లు రాజారెడ్డి గురించి మాట్లాడుతున్నారు
గొడ్డలితో నరికి చంపిన వాడిని నెత్తిన పెట్టుకుని ఊరేగిస్తున్నది మీరే..
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి


