ఒంటిమిట్ట : ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామాలయాన్ని రాష్ట్ర బీసీ డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్‌్ రాజీవ్ రంజన్ మిశ్రా సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు ఆయనకు ఆలయ లాంఛనాలతో స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం గర్భాలయంలోని మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ రంగమండపంలో ఆయనకు అర్చకులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఆయన వెంట ఒంటిమిట్ట తహసీల్దార్ దామోదర్ రెడ్డి, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
విద్యుదాఘాతంతో
మామిడితోట దగ్ధం
రూ.5 లక్షల ఆస్తి నష్టం
బి.కోడూరు : మండల పరిధిలోని అంకనగొడుగునూరు సమీపంలో ఊదు అనితకు చెందిన 5 ఎకరాల మామిడి తోట సోమవారం సాయంత్రం విద్యుదాఘాతంతో నిప్పంటుకుని దగ్ధమైంది. దీంతో సుమారు రూ.5 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు రైతు వాపోయారు. విద్యుదాఘాతం కారణంగా తోటలో ఎండు గడ్డికి నిప్పంటుకుని మంటలు వ్యాప్తి చెందాయని కాపాలాదారు తెలిపారు. తోట చుట్టూ మంటలు వ్యాపించడంతో 5 ఎకరాల్లోని మామిడి తోట పూర్తిగా కాలిపోయిందని వాపోయారు. ఉద్యానవన అధికారులు స్పందించి పంటను పరిశీలించి న్యాయం చేయాలని బాధిత రైతు కోరుతున్నారు.


