అధికారుల కనుసన్నల్లో చెయ్యేరు లూటీ | - | Sakshi
Sakshi News home page

అధికారుల కనుసన్నల్లో చెయ్యేరు లూటీ

May 26 2026 3:26 AM | Updated on May 26 2026 3:26 AM

నందలూరు : మైన్స్‌ అధికారుల కనుసన్నల్లో టీడీపీ పచ్చనేతలు కొందరు చెయ్యేరును లూటీ చేస్తున్నారు. మండలంలోని కుందా నెల్లూరు గ్రామ పంచాయతీ కుమారునిపల్లి ఇసుక క్వారీ చెయ్యేరులో అనుమతులకు విరుద్ధంగా హిటాచీ యంత్రాలతో ఇసుకను టిప్పర్లకు అధిక లోడు చేసి పగలు, రాత్రి తేడా లేకుండా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. మామూళ్ల మత్తులో మైన్స్‌, రెవెన్యూ అధికారులు జేబులు నింపుకొంటున్నారని సోమవారం వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ సిద్దవరం గోపిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఇసుక అక్రమరవాణాను అరికట్టాలను స్థానిక పోలీసులకు, తహసీల్దార్‌ శివలక్ష్మీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గోపిరెడ్డి మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణాను నిలిపివేయాలని గతంలో అన్నమయ్య, కడప జిల్లాల కలెక్టర్లు, మైన్స్‌ అధికారులు, సబ్‌ కలెక్టర్‌, తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసినా ఫలితం లేదన్నారు. ఇసుక అక్రమ రవాణాతో భూగర్భ జలాలు అడుగంటిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. చెయ్యేరులో అనుమతులకు విరుద్ధంగా యంత్రాలతో 15 అడుగుల లోతు వరకు ఇసుకను తోడి టిప్పర్లకు లోడు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నా బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్లు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు ఇసుక అక్రమ రవాణాను అరికట్టకపోతే వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని సిద్దవరం గోపిరెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో గొబ్బిళ్ల త్రినాథ్‌, అరిగెల సౌమిత్రి, గుండు మల్లికార్జునరెడ్డి, బయనబోయిన భాస్కర్‌యాదవ్‌, ఆకేపాటి జగదీశ్వర్‌రెడ్డి, అనుదీప్‌, గీతాల నరసింహారెడ్డి, దండు గోపి, విశ్వనాధరెడ్డి, కళ్యాణ్‌రెడ్డి, పెనుబాల నాగసుబ్బయ్య, కాకి చంద్ర, అక్కిరెడ్డి మోహన్‌రెడ్డి, షేక్‌ షావల్లి, అజీజ్‌, దాదిరెడ్డి నరసారెడ్డి, మహబూబ్‌బాషా, ఎముక దుర్గయ్య, బూసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, మంచా మురహరి, విజయుడు, వెంకటయ్య, నాగరాజు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement