పది రోజులు..నాలుగు మార్లు..! | - | Sakshi
Sakshi News home page

పది రోజులు..నాలుగు మార్లు..!

May 26 2026 3:02 AM | Updated on May 26 2026 3:02 AM

పెంచిన ధరలు తగ్గించాలి

వరుసగా పెరుగుతున్న

పెట్రోల్‌ డీజల్‌ ధరలు

తాజాగా పెట్రోలుపై రూ. 2.84,

డీజల్‌పై రూ2.86 చొప్పున పెంపు

వరుస పెంపుదలపై

వాహనదారుల ఆగ్రహం

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌:: కూటమి సర్కార్‌ హయాంలో పెట్రోలు, డీజల్‌ మంట భయపెడుతోంది. ఎప్పు డూ లేని తరహాలో కేవలం పది రోజుల వ్యవధిలో నాలుగుమార్లు ధరలు పెంచడం వాహనదారుల్లో ఆగ్రహం తెప్పిస్తోంది. ఒక రూపాయి...రెండు రూపాయలు కాదు..పెట్రోలు, డీజల్‌పై ఏకంగా రూ.8 వరకు పెంచుకుంటూ పోవడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పెంచిన ఇంధన ఛార్జీలు తగ్గింపు కోరుతూ కూటమి పార్టీలు మినహా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతోపాటు వామపక్షాలు, ప్రజా సంఘాలు పోరుబాటకు సంకల్పించాయి.

ఇంధన ధరలు ౖపైపెకి...

జిల్లాలో వాహనదారులపై ఇంధన ధరల పెంపు పెను ప్రభావం చూపనున్నాయి. జిల్లాలో కంటైనర్లు, లారీలు, బస్సులు, జీపులు, కార్లు, ట్రాక్టర్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు దాదాపు ఆరు లక్షలకు పైగా ఉన్నాయి. ప్రతినిత్యం వాహనాలు బయటికి కదలాలంటే పెట్రోలు, డీజల్‌ అవసరం. తాజాగా ధరల పెంపు కారణంగా పెట్రోలు రూ. 116.66, డీజల్‌ రూ. 104.38కు చేరుకుంది. ఒకవైపు నిత్యావసర సరుకుల ధరలు మండిపోతుండగా, మరోవైపు వాహనాల వినియోగానికి సంబంధించిన ఇంధన ధరలు ౖపైపెకి చేరుకుంటున్నాయి. కూటమి సర్కార్‌ అధికార పగ్గాలు చేపట్టిన రెండేళ్లలోనే ఇంత భారీగా పెంచుకుంటూ పోవడం వాహనదారులను కుదిపేస్తోంది.

జిల్లాలో 242 పెట్రోల్‌ బంకులు

జిల్లాలో హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌తోపాటు పలు కంపెనీల పరిధిలో 242 బంకులు పనిచేస్తున్నాయి. ఆయా బంకుల ద్వారా రోజుకు డీజిల్‌ 5.30 లక్షల లీటర్లు, పెట్రోలు 3.30 లక్షల లీటర్లు విక్రయిస్తున్నారు. ఇంధన కొనుగోలుపై వాహనదారులకు పెద్ద ఎత్తున వాత పడుతోంది. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వ హయాంలో ఇంధన ధరలు ౖపైపెకే పోతుండడంతో ఆందోళన కలిగించే పరిణామం. కేవలం పది రోజుల వ్యవధిలో నాలుగు సార్లు వివిధ పద్దుల్లో సుమారు రూ. 8 వరకు పెంచుకుంటూ పోయారు. లీటరుపై సరాసరిన రూ.8 అంటే....ఒక వ్యక్తి వాహనానికి 10 లీటర్ల పెట్రోలు పట్టిస్తే అదనంగా రూ.80 భరించాల్సి వస్తోంది.

పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరల విషయంలో మోదీ మోసం సరే చంద్రబాబు హామీ ఏమైందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను తగ్గిస్తామని చంద్రబాబు లోకేష్‌, పవన్‌ కల్యాణ్‌ హామీ ఇచ్చారు. రెండేళ్లలో పెట్రోల్‌ డీజిల్‌ గ్యాస్‌ ధరలను తగ్గించకపోగా వరుసగా పెంచుతున్నారు. దీంతో సామాన్య పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే పెంచిన ఇంధన ధరలను తగ్గించాలి. – గాలి చంద్ర, సీపీఐ జిల్లా కార్యదర్శి

Advertisement
 
Advertisement
Advertisement