కడప సెవెన్‌రోడ్స్ : పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్టెప్ సీఈఓ ఐజే విజయ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. సామాజిక సేవా రంగంలో అర్హులైన వారు హెచ్‌టీటీపీఎస్://అవార్‌ుడ్స.జీఓవీ.ఇన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. హార్డ్, సాఫ్ట్ కాపీలను ఈనెల 31వ తేదీలోపు పోస్టుద్వారాగానీ, లేదా స్టెప్ కార్యాలయంలో అందజేయవచ్చని తెలిపారు. వివరాలకు 98494 97011 నెంబరులో సంప్రదించాలని కోరారు.
28వ తేదీ పది పరీక్ష వాయిదా
– డీఈఓ షేక్ షంషుద్దీన్
కడప ఎడ్యుకేషన్: పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా ఈ నెల 28వ తేదీ జరగవలసిన ఇంగ్లీష్ పరీక్ష బక్రీద్ పండగ కారణంగా వాయిదా పడినట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. సదరు పరీక్షను జూన్ 5వ తేదీ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. సంబంధిత విషయాన్ని విద్యార్థులు వారి తల్లితండ్రుల గమనించాలని ఆయన కోరారు.
ప్రశాంతంగా
ఇంటర్ మ్యాథ్స్ పరీక్ష
కడప ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా సోమవారం మ్యాథ్స్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఇందులో భాగంగా ప్రథమ సంవత్సరానికి సంబంధించి 256 మంది గైర్హాజరయారు. అలాగే సెకండియర్‌కు సంబంధించి 193 మంది గైర్హాజరయారు. జిల్లాలో ఎక్కడ కూడా మాల్ ప్రాక్టీస్ కేసును నమోదు కాలేదని అధికారులు తెలిపారు.
తొలిరోజు పరీక్ష ప్రశాంతం
కడప ఎడ్యుకేషన్: జిల్లాలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 22 పరీక్షా కేంద్రాలలో 1430 మంది విద్యార్థులకు 1159 మంది హాజరయ్యారు. అలాగే ఓపెన్ పది పరీక్షలకు సంబంధించి 376 మందికి 338 మంది హాజరయ్యారు. దీంతోపాటు ఇంటర్‌కు సంబంధించి 560 మందికి 515 మంది హాజరుకాగా 45 మంది గైర్హాజరయారు.ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు.
ఈవీఎం గోడౌన్ల పరిశీలన
కడప సెవెన్‌రోడ్స్ : కలెక్టరేట్ భవన సముదాయంలోని ఈవీఎం గోడౌన్లను సోమవారం కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పరిశీలించారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు నెలవారీ తనిఖీల్లో భాగంగా ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్ల పరిస్థితిని తనిఖీ చేశామని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో హెచ్–సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీకాంత్ రెడ్డి, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పీఎం రాష్ట్రీయ బాల్
పురస్కార్‌కు నామినేషన్లు
కడప సెవెన్‌రోడ్స్ : దేశవ్యాప్తంగా ప్రతిభ కనబరిచిన బాలలను ప్రోత్సహించేందుకు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ ప్రతిష్ఠాత్మకంగా అందజేస్తున్న ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్–2027 కోసం నామినేషన్లు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా స్వీకరిస్తారని పేర్కొన్నారు. ధైర్యం, సామాజిక సేవ, పర్యావరణ పరిరక్షణ, క్రీడలు, కళలు, సంస్కృతి, విజ్ఞానం, సాంకేతికత వంటి రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన బాలలకు ఈ జాతీయ పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఐదేళ్లు పూర్తయి 18 ఏళ్లు మించని భారతీయ బాలలు ఈ పురస్కారానికి అర్హులని వివరించారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను హెచ్‌టీటీపీఎస్://అవార్డు.జీఓవీ.ఇన్ ద్వారా మాత్రమే సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పూర్తి సమాచారం కోసం అధికార వెబ్‌సైట్ లేదా ఐసీడీఎస్ అఽధికారులను సంప్రదించాలని సూచించారు.
కడప అగ్రికల్చర్: జిల్లావ్యాప్తంగా సోమవారం తెల్లవారుజామున పలు మండలాల్లో వర్షం కురిసింది. ఇందులో ఎర్రగుంట్లలో అత్యధికంగా 42.4 మి.మీ వర్షం నమోదైయింది. అలాగే దువ్వూరులో 28.4, సిద్దవటంలో 26.8, ఖాజీపేటలో 12.2, పెండ్లిమర్రిలో 10.2, సీకేదిన్నెలో 8.6, చక్రాయపేటలో 6.6, వల్లూరులో 5.8, పులివెందుల్లో 5, ప్రొద్దుటూరులో 4.6, చాపాడులో 3.2, వేములలో 3, కమలాపురం, గోపవరంలలో 2.4, మైదుకూరులో 1.2, వీఎన్‌పల్లిలో 1, సింహాద్రిపురంలో 0.8 మి.మీ వర్షం నమోదైంది. ఎర్రగుంట్లలో కురిసిన కుండపోత వర్షానికి పలు విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి.


