కడప అగ్రికల్చర్: జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయసాగు విస్తరించాలని జిల్లా వ్యవసాయ అధికారి మట్టా సుబ్రమణేశ్వరావు సూచించారు. కడప నగరంలోని జిల్లా మహిళా సమైక్య భవనంలో సోమవారం ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏల్‌నినో ప్రభావంతో ఉన్న పరిస్థితులు అనుగుణంగా రైతులకు తెలియజేసి వాటి తగిన పంటలు వేయించేలా రైతులకు సలహాలు ఇచ్చి ప్రకృతి వ్యవసాయంలో ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. ఈ సంవత్సరం మన లక్ష్యాన్ని ఽ దృష్టిలో పెట్టుకొని ప్రతి క్యాడర్ కూడా పనిచేయాలని చెప్పారు. ప్రకృతి సేద్యం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ఎస్‌వి ప్రవీణ్ కుమార్ పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో అదనపు జిల్లా ప్రాజెక్టు మేనేజర్,వసంతకుమారి, ప్రకృతి వ్యవసాయ సిబంది పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయ అధికారి
మట్టా సుబ్రమణేశ్వరావు


