పేదలపై పెనుభారం | - | Sakshi
Sakshi News home page

పేదలపై పెనుభారం

May 26 2026 3:02 AM | Updated on May 26 2026 3:02 AM

పేదలపై పెనుభారం జీఎస్టీ పరిధిలోకి తేవాలి

డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెంచి పేదలపై పెనుభారం మోపుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్టానుసారం పెట్రోల్‌, డీజిల్‌పై పన్నులు వేస్తుండడంతోనే ధరలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. తద్వారా నిత్యావసర వస్తువులు ధరలు సైతం ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి పెంచిన ధరలు తగ్గించాలి.

– భానుప్రకాష్‌రెడ్డి, ఎర్రగుంట్లపల్లె

పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. రోజు రోజుకు ధరలు పెంచుతుండడంతో పలువురు డ్రైవర్లు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. దేశంలోనే ఎక్కడాలేని విధంగా ఆంధ్రప్రదేశంలో డీజిల్‌, పెట్రోల్‌పై పన్ను భారం మోపడం తీవ్ర అన్యాయం.

– చక్రధర్‌, పీలేరు

Advertisement
 
Advertisement
Advertisement