జమ్మలమడుగు రూరల్ : తొర్రివేముల గ్రామానికి చెందిన అవుల చిన్న వెంకటరెడ్డి (52) అనే రైతు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మైలవరం మండలం తొర్రివేముల గ్రామానికి చెందిన ఆవుల చిన్న వెంకటరెడ్డి ఆదివారం సాయంత్రం పట్టణంలోని బైపాస్‌లో ఉన్న బిజెఆర్ కల్యాణ మండపం సమీపంలోకి వచ్చి వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి పడి ఉన్నాడు. స్థానికులు గమనించి 108కు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ప్రభుత్వ ఆసు పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.
కూలిన మిద్దె
తొండూరు : వైఎస్సార్ కడప జిల్లా మల్లేల గ్రామంలో ఆదివారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. గ్రామానికి చెందిన వద్ధురాలు రామిరెడ్డి సరోజమ్మ ఇంట్లో ఉండగా ఒక్కసారిగా మిద్దె కూలి కిందపడింది. శబ్దం విన్న స్థానికులు అప్రమత్తమయ్యారు. అదే సమయంలో గ్రామంలో ఉన్న వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ భూమిరెడ్డి రవీంద్రారెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. చుట్టుపక్కల వారి సాయంతో శిథిలాల కింద చిక్కుకున్న సరోజమ్మను సురక్షితంగా బయటకు తీశారు. ఆమెకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
రోడ్డు ప్రమాదంలో
ఇద్దరికీ తీవ్ర గాయాలు
మదనపల్లె టౌన్ : బి కొత్తకోట మండలంలో ఆదివారం రాత్రి జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో స్కూటరిస్టుతో పాటు, రోడ్డు పక్కన నిలుచుని ఉన్న మరో మహిళ కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రి అవుట్ పోస్టు పోలీసుల కథనం మేరకు.. బి కొత్తకోట మండలం కోటా వూరు పంచాయతీ కాండ్లమడుగు క్రాసులో కాపురం ఉంటున్న లక్ష్మీదేవి(62) రోడ్డు పక్కన నిలుచుని ఉండగా, కురబలకోట మండలం ఇరమద్దివారిపల్లి కు చెందిన వరదారెడ్డి(58) పనిమీద బైకులో బి.కొత్తకోటకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తూ లక్ష్మీదేవిని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
త్రుటిలో బయటపడిన వృద్ధురాలు


