● పంట నష్టం అంచనా రూ. 2.31 కోట్లు: కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి | - | Sakshi
Sakshi News home page

● పంట నష్టం అంచనా రూ. 2.31 కోట్లు: కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి

May 24 2026 1:45 AM | Updated on May 24 2026 1:45 AM

● పంట నష్టం అంచనా రూ. 2.31 కోట్లు: కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి

నేలమట్టమైన అరటి తోటలను పరిశీలించిన ఎంపీ

పులివెందుల/లింగాల: రైతులపై చంద్రబాబు సర్కారుకు చిత్తశుద్ధి లేదని మరోసారి రుజువైంది. పెనుగాలులకు అరటి తోటలు నిలువునా నేలకొరుగుతున్నా ఆదుకుందామన్న ధ్యాసే లేకుండా పోయింది. ఒకవైపు అకాల ఈదురు గాలుల వల్ల వందలాది ఎకరాలలో అరటి తోటలు సర్వనాశనమై, ప్రతి ఎకరాకు లక్షలాది రూపాయల భారీ నష్టం వాటిల్లితే.. మరోవైపు వాతావరణ కేంద్రాలలో గాలి వేగం రికార్డు కాకపోవడాన్ని సాకుగా చూపిస్తూ ఇన్సూరెన్స్‌ కంపెనీలు రైతులకు నిలువునా ద్రోహం చేస్తున్నాయి. ఆటోమేటిక్‌ వెదర్‌ స్టేషన్లు పనిచేయకపోవడం, సాంకేతిక లోపాల వల్ల గాలి వేగం నమోదు కాకపోవడాన్ని ఆసరాగా చేసుకుని, అన్నదాతలకు అందాల్సిన హక్కుగా రావాల్సిన బీమా సొమ్మును నిలిపివేయడం ఏమాత్రం సబుబు కాదని ఇటు రైతాంగం, అటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ప్రశ్నిస్తున్నాయి.

మళ్లీ అదే కథ.. రికార్డుల నమోదులో దొంగదెబ్బ!

తాజాగా గురువారం రాత్రి సంభవించిన ప్రకృతి విపత్తులో వేలాది ఎకరాల్లో అరటి చెట్లు విరిగిపడినా, వాతావరణ కేంద్రాల గాలి వేగం రికార్డులు పరిశీలిస్తే సాంకేతిక డొల్లతనం మళ్లీ బయటపడింది. లింగాల వాతావరణ కేంద్రంలో గాలి వేగం గంటకు సగటున కేవలం 21 కిలోమీటర్లుగా నమోదైంది. ఇప్పట్ల గ్రామానికి సంబంధించిన వెదర్‌ స్టేషన్‌లో రికార్డు ‘నాట్‌ ఆప్లికేబుల్‌’ అని తేలింది. మురారిచింతల గ్రామంలో అసలు గాలి వేగమే రికార్డు కాలేదు. తోటలు కళ్లముందే నేలమట్టమైనా, ఇలాంటి సాంకేతిక లోపాల వల్ల వాతావరణ రికార్డులలో గాలి వేగం తక్కువగా నమోదు కావడం లేదా అసలు నమోదు కాకపోవడం వల్ల ఈసారి కూడా రైతులకు బీమా సొమ్ము అందకుండా పోయే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

గత ఏడాది కలెక్టర్‌ లేఖ రాసినా మారని పరిస్థితి!

గడిచిన ఏడాది కూడా ఇదే తరహాలో భారీ వాతావరణ విపత్తు జరిగినప్పుడు, కలెక్టర్‌ స్పందించి, బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ఇఫ్కో టోక్యో ఇన్సూరెన్స్‌ కంపెనీకి ఒక అధికారిక లేఖ రాశారు. వాతావరణ కేంద్రాలలో గాలి వేగం నమోదు కాలేదు తప్ప, ఇందులో రైతు తప్పిదం ఏమాత్రం లేదు కాబట్టి రైతులకు పంటల బీమా చెల్లించాలని కలెక్టర్‌ ఆ లేఖలో స్పష్టం చేశారు. ఈ ఏడాది కూడా అదే దుస్థితి నెలకొంది. వెదర్‌ స్టేషన్లు పనిచేస్తున్నాయో లేదో చూసుకోవాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వం, స్టాటిస్టిక్స్‌ అధికారులు, పంటల బీమా సంస్థలదే తప్ప రైతులది కాదని వైఎస్సార్‌సీపీ నేతలు తేల్చి చెప్పారు.

ప్రభుత్వం దిగిరాకుంటే

‘మెడలు వంచుతాం’ : ఎంపీ అవినాష్‌రెడ్డి

ఈ ఏడాదికి సంబంధించి నిన్న జరిగిన నష్టానికి కూ డా వెదర్‌ స్టేషన్ల వైఫల్యాన్ని సాకుగా చూపకుండా, ప్రభుత్వం ముందుకు వచ్చి ‘ఇన్‌పుట్‌ సబ్సిడీ’తోపాటు పంటల బీమా కూడా నష్టపోయిన ప్రతి రైతుకు చెల్లించాలని ఎంపీ అవినాష్‌రెడ్డి గట్టిగా డిమాండ్‌ చే శారు. అధికారులు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి రైతుల పొట్టకొట్టొద్దని హితవు పలికారు. బాధి త రైతులకు పరిహారం చెల్లించని పక్షంలో, కూటమి ప్రభుత్వం మెడలు వంచేవరకు రైతుల పక్షాన వైఎస్సా ర్‌సీపీ ముందుండి పోరాడుతుందని స్పష్టం చేశారు. అన్నదాతలకు న్యాయం చేయడం కోసం అవసరమైతే కోర్టుల ద్వారా న్యాయ పోరాటానికైనా తాము వెనుకాడబోమని అధికార పార్టీని గట్టిగా హెచ్చరించారు.

పులివెందుల రూరల్‌.. నల్లపురెడ్డిపల్లెలో ఈదురుగాలులకు నేలకొరిగిన అరటి చెట్లు (ఫైల్‌)

మురారిచింతలలో దెబ్బతిన్న అరటి తోటను పరిశీలిస్తున్న ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

పులివెందుల/లింగాల: ఇటీవల సంభవించిన అకాల ఈదురు గాలుల వల్ల నిలువునా నష్టపోయిన అరటి రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, ప్రతి ఎకరాకు యుద్ధప్రాతిపదికన ఇన్‌పుట్‌ సబ్సిడీతో పాటు పంటల బీమా చెల్లించాలని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన జిల్లాలోని లింగాల, ఇప్పట్ల, మురారిచింతల తదితర పంట నష్టపోయిన గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి, నేలమట్టమైన అరటి తోటలను స్వయంగా పరిశీలించారు. తీవ్ర ఆవేదనలో ఉన్న అన్నదాతలను పరామర్శించి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

GMýS-Æ>MýS$ ₹6 ÌS„ýSÌS ¿êÈ ¯]lçÙt…:

అన్నదాతల కన్నీళ్లు

ఈ సందర్భంగా ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ, నీళ్ల సమస్య, గిట్టుబాటు ధర లేమి వంటి ఎన్నో సవాళ్లను అధిగమించి కష్టపడి పంట పండిస్తే.. ప్రకృతి కన్నెర్ర చేసి రైతుల నోటి ముద్దను లాగేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత మార్కెట్‌ ధరల ప్రకారం టన్ను అరటి రూ. 25,000 పలుకుతోందని, ఎకరాకు సగటున 20 నుంచి 30 టన్నుల దిగుబడి వచ్చే తరుణంలో తోటలు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. దీనివల్ల ప్రతి రైతుకూ ఎకరాకు రూ. 5 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు భారీ నష్టం వాటిల్లిందని, దాదాపు 2,000 ఎకరాల్లో పంట దెబ్బతిని రైతాంగం కోలుకోలేని స్థితికి చేరుకుందని ఆందోళన వ్యక్తం చేశారు.

వెదర్‌ స్టేషన్లు పనిచేయకపోవడంతోరైతులకు నష్టం

లింగాల, ఇప్పట్ల, మురారిచింతలలోరికార్డు కాని గాలి వేగం

అధికారులు, బీమా సంస్థల తప్పుకు రైతులకు అన్యాయం

కళ్లముందే తోటలు ధ్వంసం..రికార్డుల్లో మాత్రం ‘సున్నా’

సర్కారు మెడలు వంచుతాం:ఎంపీ అవినాష్‌రెడ్డి

కడప అగ్రికల్చర్‌: జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు, హోరుగాలులకు జరిగిన పంట నష్టంపై అధికారులు పరిశీలించి సిద్ధం చేసిన ప్రాథమిక నివేదికలను ప్రభుత్వానికి పంపించామని కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి పేర్కొన్నారు. ఇటీవల కురిసిన వర్షాల వలన జరిగిన పంట నష్టంపై శనివారం టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ ఉద్యాన శాఖలకు సంబంధించిన సిబ్బంది పంట నష్టం అంచనా వివరాలను మరింత పకడ్బందీగా చేసి తుది పంట నష్టం వివరాలతో కూడిన నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు.

6 హెక్టార్లలో వరి పంట నష్టం..

వ్యవసాయ శాఖకు సంబంధించి ఒంటిమిట్ట మండలంలోని కొత్త మాధవరం, సాలాబాద్‌ గ్రామాలలో కోత దశలో ఉన్న వరి పంట దెబ్బతినిందని, ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు 6 హెక్టార్లలో వరి పంట నేలకూలి 8 మంది రైతులకు నష్టం వాటిల్లినట్లు కలెక్టర్‌ వెల్లడించారు.

జిల్లాలో భారీగా దెబ్బతిన్న

ఉద్యాన పంటలు

ఉద్యాన పంటలకు సంబంధించి జిల్లాలో పులివెందుల,లింగాల, వేముల,వేంపల్లి,సింహాద్రిపురం తదితర మండలాల్లోని ఉద్యాన పంటలు 665.6 హెక్టార్లలో 705 మంది రైతులకు నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనాను ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిపారు. ఇందులో ప్రధానంగా అరటిపంట 630 హెక్టార్లలో నష్టం వాటిల్లిందని పంట నష్టం అంచనా సుమారు 2 కోట్ల 31 లక్షలుగా ఉన్నట్లు ప్రాథమిక అంచనా అని వెల్లడించారు. రైతులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి అవసరమైన చర్యలు తీసుకునే దిశగా వ్యవసాయ,ఉద్యాన శాఖ అధికారులు పనిచేయాలని కలెక్టర్‌ ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement