సదుం: ‘సర్’ సర్వేలో పుంగనూరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ మద్దతుదారులకు సంబంధించి ఒక్క ఓటు కూడా తొలగించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. నియోజవర్గ నేతలతో తిరుపతిలోని క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన సమావేశం నిర్వహించారు. టీడీపీ నాయకులు అనర్హులను ఓటర్ల జాబి తాలో చేర్చేందుకు ప్రయత్నిస్తే అభ్యంతరం వ్యక్తం చేయాలన్నారు. కార్యక్రమ ప్రాధాన్యత గుర్తించి సర్వే ముగిసే వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. అందరూ సమన్వయం చేసుకుని, కష్టపడి పని చేసి నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు జింకా చలపతి, మాజీ మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్ రెడ్డి, బూత్ కమిటీ నియోజకవర్గ అధ్యక్షుడు రమేశ్ రెడ్డి, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.


