వైఎస్‌ రాజారెడ్డి ఆదర్శప్రాయుడు | - | Sakshi
Sakshi News home page

వైఎస్‌ రాజారెడ్డి ఆదర్శప్రాయుడు

May 24 2026 1:45 AM | Updated on May 24 2026 1:45 AM

పులివెందుల : దివంగత వైఎస్‌ రాజారెడ్డి ఆదర్శప్రాయుడు అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సతీమణి, మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాతృమూర్తి వైఎస్‌ విజయమ్మ కొనియాడారు. దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి తండ్రి వైఎస్‌ రాజారెడ్డి 28వ వర్ధంతి సందర్భంగా శనివారం వైఎస్‌ కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. పులివెందుల డిగ్రీ కళాశాల రోడ్డులోని వైఎస్సార్‌ సమాధులతోటలో దివంగత వైఎస్‌ రాజారెడ్డి, వైఎస్‌ జయమ్మ సమాధుల వద్ద వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ రాజారెడ్డి తనయుడు వైఎస్‌ సుధీకర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ మున్సిపల్‌ ఇన్‌చార్జి వైఎస్‌ మనోహర్‌రెడ్డి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ వరప్రసాద్‌, వైఎస్సార్‌సీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

వైఎస్‌ రాజారెడ్డికి వైఎస్‌ విజయమ్మ నివాళి

Advertisement
 
Advertisement
Advertisement