సరస్వతీ నిలయంపై దాడి! | - | Sakshi
Sakshi News home page

సరస్వతీ నిలయంపై దాడి!

May 24 2026 1:45 AM | Updated on May 24 2026 1:45 AM

రాజంపేట : నియోజకవర్గంలోని నందలూరు మండలం లేబాక జిల్లా పరిషత్‌ హైస్కూల్‌(సర్వసతినిలయం)ంపై కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేశారు. ఈ సంఘటన బుధవారం చోటుచేసుకుంది. శుక్రవారం వెలుగులోకి వచ్చింది. కూటమి ప్రభుత్వంలో విద్యాసంస్ధలపై కూడా రాజకీయ వర్గ వైషమ్యాలు చుట్టుముడుతున్నాయనడానికి ఈ ఘటనే నిదర్శనం. దొంగలు బీరువాలపై తమ ప్రతాపం చూపారు. బీరువాల్లో హైస్కూల్‌కు సంబంధించిన రికార్డులు ఉన్నాయి. కొన్ని రికార్డులు కనిపించడంలేదని సమాచారం. హైస్కూల్‌ హెచ్‌ఎం రాజేశ్వరి నందలూరు పోలీసులకు పిర్యాదు చేశారు.

లక్షలాది విలువ చేసే టీవీ, కంప్యూటర్లు ఉన్నా..

గుర్తుతెలియని వ్యక్తులు హెచ్‌ఎం కార్యాలయంలో లక్షలాది విలువ చేసే టీవీ, కంప్యూటర్లు ఉన్నా వాటి జోలికి వెళ్లకపోవడంతో అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం బీరువాలను ఉద్దేశపూర్వకంగా పగులగొట్టినట్లు తెలుస్తోంది. సంఘటనకు కారకులు ఎవరు అన్న అంశంపై పోలీసులు దృష్టి సారించారు.

జంతువుల సంరక్షణ కోసం

నోడల్‌ అధికారి నియామకం

కడప అర్బన్‌ : జిల్లాలో గోవధ, జంతుబలులు నిషేధమని జిల్లా ఎస్‌.పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే ఆంధ్రప్రదేశ్‌ గోవధ, జంతుబలుల నిషేద చట్టం 1977 ప్రకారం శిక్షార్హులని హెచ్చరించారు. చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జంతువుల సంరక్షణ చట్టాలు సక్రమంగా అమలు చేసేందుకు ఇన్‌స్పెక్టర్‌ టి.రెడ్డెప్పను కడప జిల్లా స్థాయి నోడల్‌ అధికారి గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జంతువుల అక్రమ రవాణా, అక్రమ వధ విషయంలో ప్రజలకు సమచారం ఉంటే టి.రెడ్డెప్పకు, ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఫోన్‌ నంబర్‌ 9121100689 కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ తెలియజేసారు.

తల్లీబిడ్డల అదృశ్యంపై కేసు

ముద్దనూరు : మండలంలోని ఉప్పలూరు గ్రామానికి చెందిన సంపంగి వెంకట శిరీష తన బిడ్డలతో సహా కనిపించకపోవడంతో ఆమె భర్త సుధాకర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు శనివారం కేసు నమోదుచేశారు.ఎస్‌ఐ మధుసూధన్‌ సమాచారం మేరకు శిరీష ఈనెల 20వతేదీన ఉప్పలూరు నుంచి తన 7 ఏళ్ల కుమార్తె సుప్రియ, 5సంవత్సరాల కుమారుడు సాయి అభిరామ్‌తో కలిసి వేసవి సెలవులుకావడంతో అనంతపురం జిల్లా గుత్తి మండలం ఎంగిలిబండలోని తన పుట్టింటికి బయలుదేరింది.అయితే ఆరోజు ఆమె తన పుట్టింటికి చేరుకోకపోవడంతో భర్త సుధాకర్‌ తన భార్య బిడ్డలకోసం కోసం వెదికాడు. వారి ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

రికార్డులు మాయం

లేబాక హైస్కూల్లో ఘటన

Advertisement
 
Advertisement
Advertisement