కేవీకేలో ముగిసిన శిక్షణ | - | Sakshi
Sakshi News home page

కేవీకేలో ముగిసిన శిక్షణ

May 24 2026 1:45 AM | Updated on May 24 2026 1:45 AM

కడప ఎడ్యుకేషన్‌ : పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించడంలో వంట సిబ్బంది పాత్ర కీలకం అని కేవీకే అధిపతి, సీనియర్‌ శాస్త్రవేత్త శిల్పకళ అన్నారు. కడప ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం – రెండో బ్యాచ్‌ కింద వంటవారు, సహాయకులు, కిచెన్‌ మేనేజర్లకు ‘‘స్మార్ట్‌ కిచెన్‌ మేనేజ్‌మెంట్‌’పై ఈనెల 21వ తేదీ నుంచి నిర్వహించిన మూడు రోజుల శిక్షణ శనివారంతో ముగిసింది. వ్యక్తిగత పరిశుభ్రత, వంటగది శుభ్రత, వంటకు ముందు ముడి పదార్థాల శుభ్రపరిచే విధానాలు, పోషక విలువలు కోల్పోకుండా కూరగాయలను కట్‌ చేసే శాసీ్త్రయ పద్ధతులపై అవగాహన కల్పించారు. అనంతరం చింతకొమ్మదిన్నె స్మార్ట్‌ కిచెన్‌ను సందర్శించారు.

కార్యక్రమంలో నాబార్డు ప్రాజెక్టు పరిశోధన సహాయకురాలు కుమారి యం.జంభావి, కేవికే శాస్త్రవేత్తలు టి. మహేష్‌ బాబు, కె. సాయి మహేశ్వరి, ఎస్‌. మానస, ఐ. సురేష్‌ కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు.

గాయపడిన వ్యక్తి మృతి

పెండ్లిమర్రి : మండలంలోని వెల్లటూరు గ్రామానికి చెందిన వెంకటసుబ్బయ్య(38) కత్తి పోటుకు గురై చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తిరుపతిలో మృతి చెందాడు. శనివారం మృతదేహానికి కడప రిమ్స్‌లో పోస్టుమార్టం చేశారు. పోలీసుల కథనం మేరకు వెల్లటూరు గ్రామానికి చెందిన వెంకటసుబ్బయ్య, వెంకటశివలు తరచూ గొడవ పడుతూ ఉండేవారు.

ఈనెల 14వ తేదీ రాత్రి వెంకట శివ.. వెంకట సుబ్బయ్య ఇంటికి వెళ్లి తలపై కత్తితో గాయపరిచాడు. అతనిని చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. వైద్యుల సూచనల మేరకు తిరుపతి అసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై అప్పట్లో ఘర్షణ కేసుగా నమోదు చేఽశాం. ప్రస్తుతం వ్యక్తి మృతిచెందడంతో హత్య కేసుగా మార్చామని ఎస్‌ఐ తులసి నాగప్రసాద్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement