ఒంటిమిట్ట : మండల పరిధిలోని కొత్తమాధవరం ఎస్‌బీఐ ఏటీఎం సమీపంలోని కడప–చైన్నె జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్‌లో వెళుతున్న ఇద్దరు యువుకలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు..మండల కేంద్రమైన ఒంటిమిట్టలోని దిగువ వీధికి చెందిన సాధక్(26), రఫీ(28) కడపలో భవన నిర్మాణ పనులు ముగించుకుని మధ్యాహ్నం బైక్‌లో ఒంటిమిట్టకు బయలుదేరారు. కడప–చైన్నె రహదారి పైకి రాగానే గుర్తుతెలియని వాహనం అడ్డురావడంతో సడన్ బ్రేక్ వేయడంతో బైక్ అదుపు తప్పి రోడ్డుపై పడింది. ఈ ప్రమాదంలో సాధక్, రఫీలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు 108 కు సమాచారం ఇవ్వడంతో 108 సిబ్బంది ఘటనా స్థలానికి చెరుకుని గాయపడిన యువకులను కడప రిమ్స్‌కు తరలించారు. రఫీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు, సన్నిహితులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
లారీ ఢీ కొని యువకుడికి..
ఒంటిమిట్ట : మండల పరిధిలోని మంటపంపల్లి సమీపంలో ఉన్న కడప– చైన్నె జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్‌పై వెళుతున్న జశ్వంత్(22) అనే యువకుడిని లారీ ఢీ కొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు..రాచగుడిపల్లి గ్రామానికి చెందిన జశ్వంత్ రాజంపేట నుంచి బైక్ పై ఒంటిమిట్టకు వస్తుండగా ప్రమాదం జరిగింది. స్థానికులు 108కు సమాచారం అందించారు. దీంతో 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన జశ్వంత్ ను కడప రిమ్స్‌కు తరలించారు.


