ప్రొద్దుటూరులో భారీగా గోవా మద్యం పట్టివేత | - | Sakshi
Sakshi News home page

ప్రొద్దుటూరులో భారీగా గోవా మద్యం పట్టివేత

May 24 2026 1:45 AM | Updated on May 24 2026 1:45 AM

ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు ఎకై ్సజ్‌ అధికారులు పెద్ద మొత్తంలో గోవా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మద్యం బాటిళ్లను తీసుకెళ్తున్న రెండు కార్లతో సహా అనంతపురం జిల్లాకు చెందిన ఇరువురు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. వివరాలను ప్రొద్దుటూరు ఎకై ్సజ్‌ సీఐ సురేంద్రారెడ్డి శనివారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు. ప్రొద్దుటూరు ఎకై ్సజ్‌ అధికారులు, కడప ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఈఎస్‌టీఎఫ్‌ అధికారులు సిబ్బందితో కలిసి జమ్మలమడుగు రోడ్డులోని చౌటపల్లె సమీపంలో ఉన్న వైఎస్సార్‌ సర్కిల్‌ వద్ద వాహనాల తనిఖీలు చేస్తుండగా రెండు కార్లలో పెద్ద మొత్తంలో మద్యం కేసులు ఉన్నాయి. దీంతో సిబ్బంది చుట్టు ముట్టి వాహనాల్లో ఉన్న అనంతపురంలోని తపోవనం ప్రాంతానికి చెందిన పామిడి ఆకుల ఇర్ఫాన్‌, నందిండ్ల బాషాలను అరెస్ట్‌ చేశారు. వాహనాల్లోని 750 ఎంఎల్‌ కలిగిన 480 గోవా రాష్ట్రం మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. రెండు కార్లలోని సీట్లను తొలగించి నిందితులు మద్యం సీసాల కేసులను అమర్చారు. నందిండ్ల బాషా గతంలో గోవా రాష్ట్రం నుంచి మద్యం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడటంతో ప్రొద్దుటూరు రూరల్‌, నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ పోలీసులు కేసులు నమోదు చేశారు. నిందితుల వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇరువురిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించనున్నట్లు ఎకై ్సజ్‌ సీఐ సురేంద్రారెడ్డి తెలిపారు. దాడుల్లో ఇన్‌ఫోర్స్‌మెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ నీలకంఠారెడ్డి, ఈఎస్‌టీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ విశ్వనాథ్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement