అస్తవ్యస్తం..అయోమయం ! | - | Sakshi
Sakshi News home page

అస్తవ్యస్తం..అయోమయం !

May 19 2026 12:46 AM | Updated on May 19 2026 12:46 AM

వార్డుల పునర్విభజన ప్రతిపాదనలు విడుదల

వార్డుల పునర్విభజన ప్రతిపాదనలు విడుదల

కడప కార్పొరేషన్‌: కడప నగరపాలక సంస్థలో చేపట్టిన వార్డుల పునర్విభజన (డీలిమిటేషన్‌) ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఎటువంటి శాసీ్త్రయత లేకుండా, అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే ఈ విభజన జరిగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నూతన పునర్విభజన ప్రకారం ఇదివరకు 50 గా ఉన్న వార్డుల సంఖ్య ఇప్పుడు 66కు పెరిగింది.

నిబంధనలు పక్కనబెట్టి జనాభా విభజన!

ప్రతి వార్డులోనూ 4 వేల నుంచి 5 వేల లోపు జనాభా ఉండేలా సమతుల్యత పాటించాలనేది ప్రాథమిక నిబంధన. అలాగే నిబంధనల ప్రకారం డివిజన్‌ జనాభా సగటు కంటే పది శాతానికి మించి ఎక్కువ లేదా తక్కువగా ఉండకూడదు. కానీ కడప కార్పొరేషన్‌లో ఈ రూల్స్‌ పూర్తిగా గాలికొదిలేశారు.

అతి చిన్న వార్డు: 21Ð]l yìlÑ-f¯ŒS ¿o-Vøã-MýS…V> ò³§ýlªV> MýS°-í³-çÜ$¢-¯]l²ç³µ-sìæMîS, MóSÐ]lÌS… 2,467 f¯é-¿ê™ø A™èlÅ…™èl _¯]l² yìlÑ-f-¯ŒSV> AÐ]l-™èlÇ…-_…-¨. B ™èlÆ>Ó™èl Ý릯]l…ÌZ 3,176 f¯é-¿ê™ø 66Ð]l yìlÑ-f-¯Œl E…¨. ಭೌ-Vø-ã-^èl*õÜ¢ 55, 54, 43 yìlÑf¯]l$Ï ^éÌê _¯]l²-ÑV> MýS°-í³-çÜ$¢¯é²Æ‡$$.

అతి పెద్ద వార్డులు:

మంది జనాభాతో 20, 48, 50 వార్డులు అత్యంత పెద్ద డివిజన్లుగా ఏర్పడ్డాయి. ఆ తర్వాత స్థానంలో 5,692 జనాభాతో 61వ వార్డు ఉంది. నగర శివార్లలోని 2వ డివిజన్‌ విస్తీర్ణంలో (ఏరియా పరంగా) అతిపెద్ద డివిజన్‌గా ఏర్పాటైంది.

రాజకీయ విభేదాలతో ఓటర్ల విభజన?

పునర్విభజనలో కడప, కమలాపురం నియోజకవర్గాలకు చెందిన ఓటర్లు పూర్తిగా వేరుపడిపోయారు. కడప ఎమ్మెల్యే ఆర్‌. మాధవి, కమలాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి పుత్తా నరసింహారెడ్డిల మధ్య ఉన్న విభేదాల కారణంగానే కమలాపురం ఓటర్లు కడపలో కలవకుండా చర్యలు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనివల్ల కమలాపురానికే ఆరు వార్డులు ప్రత్యేకంగా ఏర్పడ్డాయి. నిజానికి 2005లోనే కమలాపురం నియోజకవర్గానికి చెందిన పంచాయితీలను కార్పొరేషన్‌లో విలీనం చేశారు. ఇప్పుడు ఆ ఓటర్లను పక్కనబెట్టి పునర్విభజన చేయడం ప్రాథమిక సూత్రాలకే విరుద్ధమనే వాదనలు వినిపిస్తున్నాయి.

నిబంధనలు పక్కనబెట్టి ‘జిగ్‌జాగ్‌’ విభజన!

రోడ్లు, డ్రైనేజీ కాలువలు, రైల్వే ట్రాక్‌లు, జంక్షన్లు వంటి వాటిని సరిహద్దులుగా చూపుతూ, నార్త్‌ (ఉత్తరం) నుండి మొదలుపెట్టి క్లాక్‌వైజ్‌ (గడియారపు ముల్లు తిరిగే దిశ) డైరెక్షన్‌లో వార్డుల పునర్విభజన చేయాల్సి ఉంటుంది. కానీ కడప కార్పొరేషన్‌లో అనేక వార్డులు జిగ్‌జాగ్‌గా మారాయని తెలుస్తోంది. ముఖ్యంగా, చివరి డివిజన్‌లో రావాల్సిన పాలెంపల్లెను దేవునికడపలో కలపడం ఇప్పుడు నగరంలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

రాత్రికి రాత్రే రహస్య నోటిఫికేషన్‌!

ఆదివారం రాత్రి కార్పొరేషన్‌ కమిషనర్‌ హెచ్‌.ఎస్‌. భావన ఆదేశాల మేరకు అడిషనల్‌ కమిషనర్‌ రాకేష్‌ చంద్ర డీలిమిటేషన్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. అయితే, రాజకీయ పార్టీల నాయకులకు రాత్రి పొద్దుపోయాక ఈ సమాచారం ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు మొదటి నుండి ఈ ప్రక్రియను అత్యంత రహస్యంగా ఉంచారని, మీడియాకు కూడా కనీస సమాచారం ఇవ్వలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎమ్మెల్యే మాధవి, టీడీపీ రీజనల్‌ ఇన్‌చార్జి ఆర్‌. శ్రీనివాసులరెడ్డిలతో అధికారులు పలుమార్లు రహస్యంగా భేటీ అయి, వారు చెప్పినట్లే డివిజన్లను ఇష్టానుసారంగా ముక్కలు చేశారని విమర్శలు వస్తున్నాయి.

వివాదాస్పదంగా కడప కార్పొరేషన్‌ వార్డుల పునర్విభజన

50 నుంచి 66కు పెరిగిన వార్డుల సంఖ్య.

పూర్తిగా వేరుపడిన కడప, కమలాపురం నియోజకవర్గ ఓటర్లు.

నిబంధనలకు విరుద్ధంగా జనాభా విభజన: అతి చిన్న వార్డుగా 21,

పెద్ద వార్డులుగా 20, 48, 50.

రహస్యంగా నోటిఫికేషన్‌ విడుదల

చేయడంపై రాజకీయ పార్టీల ఆగ్రహం

కడప కార్పొరేషన్‌: కడప నగరపాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం ఉన్న 50 డివిజన్లను 66 డివిజన్లుగా డీ–లిమిటేషన్‌ (పునర్విభజన) చేయుటకు సంబంధించిన ప్రతిపాదనలు, పూర్తి వివరాలు మరియు మ్యాపులను నగరపాలక సంస్థ కమిషనర్‌ హెచ్‌.ఎస్‌. భావన సోమవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ డీ–లిమిటేషన్‌ ప్రక్రియలో భాగంగా ప్రతి డివిజన్‌ పరిధి, జనాభా, భౌగోళిక పరిస్థితులు మరియు పరిపాలనా సౌలభ్యాలను పరిగణనలోకి తీసుకొని ప్రతిపాదనలు రూపొందించబడినట్లు తెలిపారు. ప్రజలు విడుదల చేసిన మ్యాపులు మరియు వివరాలను పరిశీలించి, ఏవైనా అభ్యంతరాలు లేదా సూచనలు ఉన్నట్లయితే 18–05–2026 నుండి 24–05–2026 వరకు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్‌లో లిఖితపూర్వకంగా సమర్పించవచ్చని తెలిపారు. ప్రజల నుండి అందిన అభ్యంతరాలు మరియు సూచనలను పరిశీలించిన అనంతరం తుది ప్రతిపాదనలు సిద్ధం చేయబడతాయని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ కమిషనర్‌ రాకేష్‌చంద్ర, సీపీ శైలజ, ఏసీపీలు మునిరత్నం, మునిలక్ష్మి, టీపీవో రత్నరాజు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement