తొండూరు : మండలంలోని మల్లేల గ్రామానికి చెందిన గౌస్ అనే రైతుకు చెందిన 25 చీనీచెట్లను బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నరికేశారు. గౌస్ వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవాడు. ఈ నేపథ్యంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి చీనీ తోటలోకి వెళ్లి చీనీ చెట్లతోపాటు డ్రిప్ వైర్లు, గేట్ వాల్స్ ధ్వంసం చేశారు. ఈ సంఘటనపై తొండూరు ఎస్‌ఐ ఘన మద్దిలేటికి ఫిర్యాదు చేసినట్లు బాధతుడు తెలిపాడు.
పోలీసుల దాడులు
– నలుగురు అరెస్టు
కడప కోటిరెడ్డిసర్కిల్ : జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు డీఎస్పీ పర్యవేక్షణలో అక్రమ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్న వ్యక్తుల కదలికలపై నిఘా ఏర్పాటు చేసి నలుగురు నిందితులను అరెస్టుచేసినట్లు సీఐ రెడ్డెప్ప తెలిపారు. గురువారం ఆయన మీడియాకు వివరాలను తెలియజేశారు. ఎస్‌ఐ మహమ్మద్ రఫీ, ఏఎస్‌ఐ వెంకటేశ్వర్లు, ఇతర సిబ్బంది భగత్‌సింగ్ పార్క్ సమీపంలోని సంఘం ఫంక్షన్ హాల్ వద్ద క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడతున్న కడపకు చెందిన సంక కల్యాణ్, ఎల్లటూరు ప్రదీప్, కొడిదెల రహమత్ వల్లి, దొంతల రాహుల్ రెడ్డిలను అరెస్టుచేసి వారినుంచి రూ.17,98,500 నగదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. కొందరు నిందితులు పరారయ్యారని, వారిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.
హుండీ ఆదాయం లెక్కింపు
వల్లూరు: పుణ్య క్షేత్రమైన పుష్పగిరి కొండపైన గల శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి ఆలయంలోని శాశ్వత హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. భక్తులు స్వామివారికి హుండీ ద్వారా సమర్పించిన కానుకలను దేవదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో లెక్కించారు. ఇందులో మొత్తం రూ 4,05,325 ఆదాయం వచ్చినట్లు ఈవో శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ శివయ్య, ఆలయ అనువంశిక ధర్మకర్త దుగ్గిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి, అర్చకులు, పోలీసు సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.


