ఎత్తిపోతల పథకంతోనే సీమకు న్యాయం | - | Sakshi
Sakshi News home page

ఎత్తిపోతల పథకంతోనే సీమకు న్యాయం

Mar 27 2026 8:55 AM | Updated on Mar 27 2026 9:02 AM

మైలవరం: రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేయడం వల్ల ఈ ప్రాంతంలో నీటి ఎద్దడి తలెత్తి ప్రజలు ఇబ్బందులు పడేప్రమాదం ఉంందని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి అన్నారు. గురువారం మండలం కేంద్రంలోని మైలవరం జలాశయాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కేసీ ఆయకట్టు కింద వేసిన పంటలు ఎండిపోతున్నాయని, అందుకు కారణం కూటమి ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పేరువస్తుందనే ఉద్దేశంతో ఇక్కడి కూటమి నాయకులు ఈ పథకాన్ని నిర్వీర్యం చేశారన్నారు. ప్రస్తుతం కేసీ కెనాల్‌కు నీరు వచ్చే పరిస్థితి లేదని, అదే రాయలసీమ ఎత్తిపోతకం ప్రారంభమై ఉంటే ఈ ప్రాంత వాసులకు తాగు, సాగునీరు వచ్చి ఉండేదన్నారు. కేసీ కెనాల్‌కు మైలవరం జలాశయం నుంచి నీటిని తరలించేందుకు గత రెండు రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారని, వారి తప్పును కప్పిపుచ్చుకోవటానికి ఈ నీటిని వాడుతున్నట్లు ఆయన తెలిపారు. మైలవరం టీబీసీ కాలువ ద్వార తీగలేరు వాగుకు పంపించి కేసీ కెనాల్‌కు నీటిని కుందూ ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పోతిరెడ్డి పాడు హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద మోటార్లు బిగిస్తే పథకం ప్రారంభమవుతుందని, అయితే వైఎస్‌ జగన్‌కు పేరు వస్తుందని కూటమి ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి పట్టించుకోవడం లేదన్నారు. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలు తీసుకున్న నిర్ణయం వల్ల ప్రస్తుతం గండికోటప్రాజెక్టు, మైలవరం, రాయలసీమల్లో పలు ప్రాంతాల్లో కుంటలు చెరువులు నీటితో నింపుకోగల్గుతున్నామన్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఈసీ సభ్యుడు గిరిధర్‌రెడ్డి, జిల్లా అదికార ప్రతినిధి మోహన్‌రెడ్డి,జమ్మలమడుగు పరిశీలకులు పోరెడ్డి నరసింహారెడ్డి, మండల అధ్యక్షుడు ధన్నవాడ మహేశ్వరరెడ్డి, భాస్కర్‌రెడ్డి, ముల్లాజానీ, మున్సిపల్‌విభాగ జిల్లా అధ్యక్షుడు హృషికేశవరెడ్డి, మండల నాయకుడు ఆంజేయులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement