ప్రయాణికులకు మెరుగైన వసతుల కల్పనకు కృషి | - | Sakshi
Sakshi News home page

ప్రయాణికులకు మెరుగైన వసతుల కల్పనకు కృషి

Mar 27 2026 8:55 AM | Updated on Mar 27 2026 8:55 AM

రాజంపేట: రాజంపేట రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులకు మెరుగైన వసతల కల్పనకు రైల్వే అధికారులు కృషిచేయాల్సిన ఆవశ్యకత ఉందని ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి పేర్కొన్నారు. గురువారం రాజంపేట రైల్వేస్టేషన్‌ను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా ఈ రైల్వేస్టేషన్‌లో రెండు ఎక్సలేటర్లు, లిప్ట్‌ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో ఇక్కడ పార్శిల్‌ ఆఫీసు ఉండేదన్నారు. అప్పట్లో ఈ ప్రాంతం నుంచి నిమ్మకాయల ఎగుమతి జరిగేవన్నారు. అలాగే ఉద్యానవనపంటలు రైళ్ల ద్వారా ఎగుమతి చేయాలన్నారు. ఈ నేపథ్యంలోనే పార్శిలాఫీసు బలోపేతం దిశగా రైల్వే అధికారులు యోచించాలన్నారు. ఎంపీలు పీవీ మిథున్‌రెడ్డి, మేడా రఘునాథరెడ్డి నేతృత్వంలో రాజంపేట రైల్వేస్టేషన్‌లో మెరుగైన సౌకర్యాల కల్పించే దిశగా ముందుకెళతామన్నారు. అమృత్‌భారత్‌ పథకం కింద రాజంపేటను చేర్చడంలో ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి కృషి ఉందన్నారు. రాజంపేట సబ్‌వేలో త్వరిగతిన మార్గం సుగమమం చేసే విధంగా రైల్వే అధికారులుతో ఇదవరకే మాట్లాడానని, ఆ దిశగా చర్యలు చేపట్టారని ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి అన్నారు.గుంతకల్‌ డీఆర్‌యూసీసీ సభ్యుడు తల్లెం భరత్‌కుమార్‌రెడ్డి, కడప సీసీ జనార్ధన్‌, ఆర్‌పీఎఫ్‌ ఎస్‌ఐ త్రివేణి, స్టేషన్‌మేనేజరు గోపి వైఎస్సార్‌సీపీ నేతలు డీలరు సుబ్బరామిరెడ్డి, పాపినేని విశ్వనాథరెడ్డి, జీవీసుబ్బరాజు, అమర్‌, దండుగోపి,శివశంకర్‌, చికెన్‌ శ్రీనివాసులగౌడ్‌, మణి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement