నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణ పనులు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణ పనులు చేపట్టాలి

Feb 2 2026 7:26 AM | Updated on Feb 2 2026 7:26 AM

నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణ పనులు చేపట్టాలి

నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణ పనులు చేపట్టాలి

నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణ పనులు చేపట్టాలి

కడప కోటిరెడ్డిసర్కిల్‌: పర్యావరణానికి ఎలాంటి అంతరాయం లేకుండా, నిబంధనలకు లోబడి అన్ని రకాల భద్రతా ప్రమాణాలను పాటి స్తూ కడప ఎయిర్‌ పోర్ట్‌ నూ తన టర్మినల్‌ భవన నిర్మాణ పనులను పూర్తిచేయాలని కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి ఎయిర్‌ పోర్ట్‌ అధికారులను ఆదేశించా రు. ఆదివారం ఉదయం కడప ఎయిర్‌ పోర్ట్‌ ప్రాంగణంలో నూతన టర్మినల్‌ బిల్డింగ్‌ నిర్మాణ పనుల పురోగతిని ఎయిర్‌ పోర్ట్‌ డైరెక్టర్‌ సుజిత్‌ కుమార్‌ పోదర్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎయిర్‌ పోర్టు పరిసరాల్లో ఎలాంటి అనధికారిక చర్యలు కానీ, భద్రతకు భంగం వాటిల్లే సంఘటనలు కానీ, నిర్మాణ పనులకు ఆటంకం కలిగించే చర్యలు కానీ చోటు చేసుకోకుండా రెవెన్యూ, పోలీసు శాఖల సమన్వయంతో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో కడప ఆర్డీవో జాన్‌ ఇర్విన్‌, రెవెన్యూ, ప్రోటోకాల్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి

కడప ఎయిర్‌ పోర్ట్‌ నూతన టర్మినల్‌ భవన పనుల పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement