ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య
చింతకొమ్మదిన్నె : మండలంలోని కొప్పర్తి హరీంద్రనగర్ గ్రామంలో తన సతీమణి పూర్ణిమ, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం వుండే తలారి నాగేంద్ర(30) ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నాగేంద్ర భార్య పూర్ణిమ శుక్రవారం రాత్రి కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాలోని డిక్సన్ కంపెనీలోకి పనికి వెళ్లి శనివారం ఉదయం 7 గంటలకు ఇంటికి వచ్చి చూడగా, ఇంటికి లోపల తలుపు గడి వేసి ఉండి పిలిచినా భర్త తలుపులు తీయలేదు. తలుపులు బలవంతంగా పగులకొట్టి చూడగా లోపల నాగేంద్ర ఫ్యాన్ కొక్కికి లుంగీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నాగేంద్ర సొంత ప్రాంతమైన నంద్యాలలో ఎక్కువగా అప్పులు చేశాడని, తీర్చలేక ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై చింతకొమ్మదిన్నె పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
వృద్ధురాలి ఆత్మహత్య
జమ్మలమడుగు రూరల్ : తొండూరు గ్రామానికి చెందిన కుడుముల పద్మావతి (60) అనే వృద్ధురాలు పేడ రంగు(సౌభాగ్య పౌడర్) తీసుకుని శనివారం ఆత్మహత్య చేసుకున్న సంఘటన జమ్మలమడుగు పట్టణంలో చోటు చేసుకొంది. ఎస్‌ఐ రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తొండూరు గ్రామానికి చెందిన కుడుముల పద్మావతి శనివారం ఇంట్లో భర్తకు చెప్పకుండా జమ్మలమడుగు పట్టణం చేరుకుంది. సాయంత్రం గాంధీ సర్కిల్ వద్ద కాసేపు నిలబడి ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో స్థానికులు 108కు సమాచారం అందించడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టరు పరిక్షీంచి మృతి చెందినట్లు తెలిపారు. దీంతో స్థానికులు ఆమెను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతురాలి భర్త వెంకటరెడ్డి ఇచ్చన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.


