సంస్థ పురోభివృద్ధికి పాటుపడండి
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఆర్టీసీ సంస్థ పురోభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని కడప జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పైడి చంద్రశేఖర్ సూచించారు. శుక్రవారం సాయంత్రం కడపలోని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కార్యాలయంలో ఆర్‌ఎం గోపాల్‌రెడ్డి అధ్యక్షతన డిపో మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఈడీ మాట్లాడుతూ ఆర్టీసీని లాభాల బాటలో పయనింపజేసేందుకు ప్రతి ఒక్కరూ తమవంతుగా కృషి చేయాలన్నారు. అలాగే కార్గోలో కడప రీజియన్‌ను రాష్ట్రంలో మొదటిస్థానంలోకి తీసుకు వచ్చారని అధికారులను అభినందించారు. రానున్న కాలంలో కూడా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని, మహాశివరాత్రికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక బస్సులు నడిపి సంస్థకు ఆదాయం వచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రీజినల్ మేనేజర్ గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ శివరాత్రికి ప్రత్యేక బస్సులను నడిపి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్లు శ్రీలత, కన్యాకుమారి, ఆర్సీ నిరంజన్, గోవర్ధన్‌రెడ్డి, గంగాధర్, ఏటీఎం జనార్దన్, అసిస్టెంట్ మేనేజర్లు మాధవీలత, లావణ్య తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ కడప జోన్ ఈడీ పైడి చంద్రశేఖర్


