రూ.400 పెట్టి బ్లాక్‌లో కొన్నాం..
నేను రెండు ఎకరాల్లో వరిపంటను సాగు చేశాను. బస్తా యూరియా కోసం రైతు సేవా కేంద్రాల చుట్టూ చాలాసార్లు తిరిగాను. ఎన్నిసార్లు తిరిగినా దొరక్కపోవడంతో 400 రూపాయలు పెట్టి డీలర్ల వద్ద కొనుక్కొని పంటకు చల్లుకున్నా.
– రామాంజనేయరెడ్డి, రైతు,
లింగాపురం గ్రామం, ప్రొద్దుటూరు మండలం
యూరియా కోసం ఇన్ని తిప్పలు పడిన పరిస్థితి గతంలో ఎప్పుడు లేదు. నేను పది ఎకరాల్లో వరిపంటను సాగుచేశాను. యూరి యా కోసం చాలా ఇబ్బందులు పడుతున్నాను. బ్లాక్‌లో కొందామంటే బస్తా 450 రూపాయలు చెబుతున్నారు. ఏం చేయాలో అర్థం కావడటం లేదు. అధికారులను అడిగితే అదో ఇదో అంటున్నారు తప్ప యూరి యాను మాత్రం సరఫరా చేయడం లేదు.
– ఆదూరి శివారెడ్డి, రైతు,
రాచాయపేట గోపవరం మండలం
గత వైఎస్సార్‌సీసీ ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు లేదు. ఎరువులు పుష్కలంగా లభించాయి. కూటమి ప్రభుత్వం అధికా రంలోకి వచ్చాక రైతులకు కావాల్సిన యూరియాను కూడా సరఫరా చేయలేకుంది. ఇప్పటికై నా చంద్రబాబు సర్కారు స్పందించి రైతులకు కావాల్సినంత యూరియాను సరఫరా చేయాలి. – రాజవోలు. సుబ్బారెడ్డి,
మండల ఉపాధ్యక్షుడు, కామసముద్రం, ఆట్లూరు
రూ.400 పెట్టి బ్లాక్‌లో కొన్నాం..
రూ.400 పెట్టి బ్లాక్‌లో కొన్నాం..


