ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మోడల్‌గా ఉండాలి
కడప అగ్రికల్చర్ : ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అందరికి మోడల్‌గా ఉండాలని రాష్ట్ర స్థాయి రైతు సాధికార సంస్థ అధికారి విజయకుమార్ సూచించారు. కడపలోని సింధూర్ ఫంక్షన్ హాల్లో శుక్ర వారం కడప జిల్లా ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి రెండోరోజు శిక్షణా కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నా, పంటల వైవిధ్య త ఎక్కువగా ఉండాలన్నా ప్రధాన పంటతో పాటు అంతర్‌పంటలు వేసుకోవాలని సూచించారు. అంత ర్ పంటల సాగుతో ఆదాయం పొందొచ్చని, భూమి కూడా సారవంతం అవుతుందని, దిగుబడి పెరుగతుందని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజె క్టు మేనేజర్ ప్రవీణ్‌కుమార్ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి 9 సూత్రాలు గురించి వివరించారు.


