‘స్మార్ట్ పోలీసింగ్’తో జిల్లాను అగ్రగామిగా నిలపాలి
కడప అర్బన్: వైఎస్సార్ కడప జిల్లా పోలీసు శాఖ మున్ముందు స్మార్ట్ పోలీసింగ్ ఇండికేటర్స్ సీఈఐఆర్, ఈ–సాక్ష్య, తదితర మాడ్యూల్స్‌పై పట్టు పెంచుకుని ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించి రాష్ట్రంలోనే అగ్రగామి జిల్లాగా నిలిపేందుకు అందరూ సమష్టిగా కృషి చేయాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో నెలవారీ నేరసమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఆర్‌అండ్‌బీ ఇతర శాఖల సమన్వయంతో తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్రామాల్లో పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. విద్యాసంస్థల వద్ద ఈవ్ టీజింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. దొంగతనం కేసుల్లో రికవరీ శాతం పెంచాలన్నారు. కడపలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని ట్రాఫిక్ సీఐ సురేష్ రెడ్డిని ఆదేశించారు. సమావేశంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు, రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే పాల్గొన్నారు.
ఎస్పీ షెల్కేనచికేత్ విశ్వనాథ్


