అన్నివర్గాలకు నష్టమే
ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం వల్ల అన్ని వర్గాల ప్రజలకు నష్టమే. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తే మంచి విద్యతోపాటు వైద్యం కూడా లభిస్తుంది. ఏ ప్రభుత్వమైన ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలి. ప్రైవేట్ మెడికల్ కళాశాలల వల్ల వైద్య విద్యకు, ఉచిత వైద్యానికి పేద విద్యార్థులు, ప్రజలు దూరమవుతారు. వైఎస్సార్‌పీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో ఉన్నత ఆశయంతో 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేశారు. వాటిని ప్రస్తుత ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలని చూడడం చాలా దుర్మార్గం.
– కె.పవన్‌కళ్యాణ్,
విద్యార్థి, ప్రొద్దుటూరు


