నిర్ణయాన్ని వెనక్కుతీసుకోవాలి
చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలనుకోవడం పేద విద్యార్థులకు శాపంగా మారింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదలకు మెరుగైన వైద్యం.డాక్టర్ చదవాలన్న పేద విద్యార్థుల కల నెరవేర్చాలన్న ఉద్దేశ్యంతో 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ కాలేజీలను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం దారుణం. ప్రజలు కూడా ప్రైవేటీకరణను పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు తక్షణమే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి.
–పోలంరెడ్డిప్రమోద్‌కుమార్‌రెడ్డి,
విద్యార్థి, రాచాయపేట, గోపవరం మండలం


